Mohan Babu House: పోలీసు బందోబస్తు నడుమ మనోజ్ సామాగ్రి తరలింపు

Renault Triber: డిసెంబర్‌లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. లక్షల రూపాయలు వెచ్చించి ఏ మోడల్‌ని కొనుగోలు చేయాలనే అయోమయంలో ఉన్నారా.

Update: 2024-12-10 12:31 GMT

Mohan Babu House: పోలీసు బందోబస్తు నడుమ మనోజ్ సామాగ్రి తరలింపు

Mohan Babu House: మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతోంది. పోలీసులు మోహన్ బాబు ఇంటికి చేరుకున్నారు. ఇవాళ మనోజ్ కు చెందిన బౌన్సర్లను జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి నుంచి విష్ణు బౌన్సర్లు పంపించేశారు. దీంతో పాటు ఆ ఇంటిలో ఉన్న మనోజ్ సామాగ్రిని పోలీసుల రక్షణలో తరలించేందుకు సిబ్బంది సిద్దమయ్యారు. ఇప్పటికే మంచు మనోజ్ సామాగ్రిని తరలించేందుకు మూడు వాహనాలను సిద్ధం చేశారు.

తన ఇల్లు కావడంతో మనోజ్ రావడానికి వీలు లేదని మోహన్ బాబు చెబుతున్నారు. మోహన్ బాబు ఇంట్లో రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలతో రెండు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే తనకు భద్రత కల్పించాలని ఇంటెలిజెన్సీ డీజీని మంచు మనోజ్ కలిసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News