సినిమాలకు రివ్యూ ఇవ్వటం ఆపేసిన మహేష్ బాబు

* సంక్రాంతి సినిమాల గురించి కూడా సైలెంట్ గా ఉన్న మహేష్ బాబు

Update: 2023-01-15 10:18 GMT

సినిమాలకు రివ్యూ ఇవ్వటం ఆపేసిన మహేష్ బాబు

Mahesh Babu: వరుస సినిమాలతో బిజీగా ఉండే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొద్ది నెలల క్రితం వరకు మహేష్ బాబుకి సినిమాలకి రివ్యూ ఇచ్చే అలవాటు కూడా ఉండేది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తనకు నచ్చిన సినిమా గురించి సోషల్ మీడియాలో సినిమా గురించి రివ్యూ చెప్పేసేవారు. గత ఏడాది కూడా మహేష్ బాబు చాలానే సినిమాలకు తలదైన శైలిలో రివ్యూలు ఇచ్చారు. కానీ ఈమధ్య మహేష్ బాబు సినిమాలకు రివ్యూలు ఇవ్వడం ఆపేశారు.

గత కొంతకాలంగా మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఒక్క సినిమా గురించి కూడా మాట్లాడింది లేదు. పైగా ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా చాలానే సినిమాలు విడుదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి "వాల్తేరు వీరయ్య", నందమూరి బాలకృష్ణ "వీరసింహారెడ్డి" వంటి పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని కూడా సాధించాయి. కానీ మహేష్ బాబు మాత్రం ఈ రెండు సినిమాల గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

దీంతో మహేష్ బాబు ఈమధ్య సినిమాలకు రివ్యూలు ఇవ్వటం ఆపేసారు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. సినిమాల పరంగా చూస్తే మహేష్ బాబు త్వరలోనే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. 

Tags:    

Similar News