SSMB 29: ఫారెస్ట్‌లో ఫైట్.. ఒడిశాలో ల్యాండ్ అయిన మహేష్..
రాజమౌళి, మహేష్ బాబు ఒడిశాలో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. కోరాపుట్ ప్రాంతంలో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరగనున్నట్టు తెలుస్తోంది.
ఫారెస్ట్‌లో ఫైట్.. ఒడిశాలో ల్యాండ్ అయిన మహేష్..
SSMB 29: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో SSMB29 వర్కింగ్ టైటిల్‌తో భారీ సినిమా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియాను శాసించిన రాజమౌళి.. ఇప్పుడు ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని డిసైట్ అయ్యారు. అందుకే ఇండియా సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడు నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం తాజాగా రాజమౌళి, మహేష్ బాబు ఒడిశాలో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. కోరాపుట్ ప్రాంతంలో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరగనున్నట్టు తెలుస్తోంది.
గత ఏడాది డిసెంబర్‌లో ఒడిశా వెళ్లిన రాజమౌళి.. అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్‌ను పరిశీలించారు. ఇప్పుడు ఒడిశాకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ కూడా జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కూడా ఉన్నారు. గతకొంతకాలంగా పృథ్వీరాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కొన్ని వారాల క్రితం పృథ్వీరాజ్‌ను ఓ ఇంటర్వ్యూలో దీనిపై ప్రశ్నించగా.. ఇంకా ఫైనల్ కాలేదు అని అన్నారు. ఇక ఇప్పుడు ఒడిశాలో మహేష్ బాబుతో కలిసి కనిపిస్తుండడంతో రాజమౌళి సినిమాలో ఇతనే విలన్ అని అర్థమవుతోంది.
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని.. మొదటి భాగం 2027 విడుదలయ్యే అవకాశం ఉందని టాక్.