MAA Elections: రసవత్తరంగా "మా" ఎన్నికలు
MAA Elections: అధ్యక్ష బరిలో ఐదుగురు సభ్యులు * పోటీలో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్‌ఎన్‌రావు, జీవిత రాజశేఖర్, హేమ
మా అధ్యక్ష పదవి పోటీ దారులు (ఫైల్ ఇమేజ్)
MAA Elections: మా ఎలక్షన్లు రసవత్తరంగా మారాయి. ఎన్నడూ లేని విధంగా మా అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువైంది. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, జీవిత రాజశేఖర్, హేమ మా అధ్యక్ష బరిలో నిల్చున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నినాదంతో మద్దతు కోరుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ.. ఈ ఐదుగురు ఒక్కో నినాదంతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. అయితే.. మా ఎన్నికల్లో లోకల్, నాన్ లోకల్ అంశం కీలకంగా మారింది. ఇప్పుడు ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.