OTT Movie: రూ. 8 కోట్లతో తీస్తే రూ. 28 కోట్లు వచ్చాయి.. ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీ..!

OTT Movie: తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు ఇటీవల కాలంలో సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Update: 2025-03-12 04:43 GMT

OTT Movie: రూ. 8 కోట్లతో తీస్తే రూ. 28 కోట్లు వచ్చాయి.. ఓటీటీలో ఇంట్రెస్టింగ్ మూవీ..!

OTT Movie: తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు ఇటీవల కాలంలో సరికొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి ఓ తమిళ చిత్రం 'కుటుంబస్థాన్‌', ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. రూ.8 కోట్లతో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రూ.28 కోట్లు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ సినిమా కథ ఏంటి.? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కుటుంబస్థాన్‌ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. నవీన్‌ (మణికందన్) ఓ మధ్యతరగతి యువకుడు. అతను తన ప్రేమించిన అమ్మాయి నీలా (సాన్వే మేఘన)ను వివాహం చేసుకుంటాడు. కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలూ ఈ పెళ్లిని వ్యతిరేకిస్తాయి. అయినా వారిద్దరూ పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తుంటారు.

పెళ్లి తరువాత స్థిరపడాలన్న లక్ష్యంతో నవీన్‌ ఉద్యోగాలు వెతకడం, చిన్న వ్యాపారాలు ప్రారంభించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో అప్పులు చేస్తాడు. అప్పుల బాధలు, ఒత్తిళ్లు, కుటుంబ సభ్యుల నిరుద్యోగ భావనలు అతనిపై భారంగా మారతాయి. ఈ పరిస్థితుల్లో నవీన్‌ తన జీవితాన్ని ఎలా గట్టెక్కించాడన్నదే ప్రధానాంశం. ప్రేమించిన భార్యతో చివరివరకు కలిసి ఉందా లేదా? కుటుంబ ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? అన్న వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా కథ, సన్నివేశాలు మన జీవితానికి దగ్గరగా ఉంటాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల తర్జనభర్జనలను అద్భుతంగా చూపించారు. డైలాగులు నాచురల్‌గా ఉండడంతో పాటు, ఎమోషన్లకు తగిన న్యాయం చేశారు. నటన పరంగా మణికందన్, మేఘన తమ పాత్రల్లో మెప్పించారు. ఎలాంటి హంగులు లేకుండా, దర్శకుడు తాను చెప్పాలనుకున్న కథను వివరంగా తెలిపారు. ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఒక ఫీల్‌ గుడ్ మూవీ చూసిన ఫీలింగ్ కలగడం ఖాయం.

Tags:    

Similar News