Breaking News: వచ్చే వారం మాల్దీవ్స్‌లో కృతిసనన్-ప్రభాస్ నిశ్చితార్థం?.. బాలీవుడ్ క్రిటిక్ సంచలన ట్వీట్..

Prabhas Marriage: ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ప్రభాస్ పేరు ముందే ఉంటుంది.

Update: 2023-02-06 09:16 GMT

వచ్చే వారం మాల్దీవ్స్‌లో కృతిసనన్-ప్రభాస్ నిశ్చితార్థం?.. బాలీవుడ్ క్రిటిక్ సంచలన ట్వీట్..

Prabhas Marriage: ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ప్రభాస్ పేరు ముందే ఉంటుంది. దాదాపు చాలా మంది హీరోలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ప్రభాస్ పేరు మాత్రం ఇంకా ఈ జాబితాలోనే మిగిలిపోయింది. వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటారు ఆ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటారు అంటూ ఇప్పటికి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి కానీ అందులో ఒక్కటి కూడా నిజం కాలేదు.

ఇక డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ప్రభాస్ పెళ్లి గురించి సంచలన ట్వీట్ చేశారు. 'బ్రేకింగ్ న్యూస్: కృతిసనన్, ప్రభాస్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఇది వారిద్దరికీ చాలా సంతోషకరమైనది' అంటూ ట్వీట్ చేశారు బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు. ఆయన ట్వీట్ చేసిన కొన్ని సెకండ్లలోనే అది విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే ఈ వార్తకి ప్రభాస్, కృతి సనన్ ఎలా స్పందిస్తారో చూడాలి. 



 

Tags:    

Similar News