Kollywood Hero Vishal Supports Kangana: నీ ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్.. కంగనాకు మద్దతుగా హీరో విశాల్..
Kollywood Hero Vishal Supports Kangana | బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మహారాష్ట్రలోని పలువురు రాజకీయ నాయకులు..
Vishal and Kangana Ranaut (File Photo)
Kollywood Hero Vishal Supports Kangana | బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మహారాష్ట్రలోని పలువురు రాజకీయ నాయకులు పై, బాలీవుడ్ లోని పలువురు నటులపైన వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ .. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది కంగనా.. ముంబై లోని తన ఆఫీస్ ని మహారాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా కూల్చివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆఫీస్ ని కూల్చుతున్నట్టుగా ఉన్న ఫొటోలను ఆమె ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
అంతేకాకుండా " నేను ఎప్పుడూ తప్పు కాదు. నా శత్రువులు కూడా మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారు, అందుకే నా ముంబై ఇప్పుడు POK గా ఉంది అని కంగనా మరో ట్వీట్ చేసింది. అందులో తన కార్యాలయాన్ని రామ మందిర నిర్మాణంతో పోల్చుతూ..'బాబర్ ఆర్మీ' తన ఆఫీసును కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది''.. ఈ ట్వీట్స్ కి డెత్ఆఫ్ డెమోక్రసీ అనే హాష్ ట్యాగ్ ని యాడ్ చేసిన సిశయం తెల్సిసిందే..
తాజాగా కంగనాకు కోలీవుడ్ హీరో విశాల్ తన మద్దతును ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా ఆమెకు ఒక రాశాడు. 'డియర్ కంగన... నీ గట్స్ కు, ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్. నీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వాన్ని నీవు ఎదుర్కొంటున్నావు. ధైర్యంగా నిలబడ్డావు. 1920లలో భగత్ సింగ్ చేసిన మాదిరి చేస్తున్నావు. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు తమ గొంతుకను ఎలా వినిపించాలో ప్రజలకు చూపించావు. ఒక సెలబ్రిటీనే కాకుండా ఒక సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చావు. నీకు వందనాలు' అని విశాల్ ట్విట్టర్ లేఖలో పేర్కొన్నాడు.
Dear @KanganaTeam pic.twitter.com/73BY631Kkx
— Vishal (@VishalKOfficial) September 10, 2020