Kiran abbavaram:హీరో కాకపోయి ఉంటే.. రాజకీయాల్లోకి వెళ్లేవాడిని కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. కొన్నాళ్ల పాటు ప్లాపులతో ఇబ్బంది పడ్డ కిరణ్.. గతేడాది " క " సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు దిల్ రుబా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Update: 2025-03-08 07:44 GMT

హీరో కాకపోయి ఉంటే.. రాజకీయాల్లోకి వెళ్లేవాడిని కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kiran abbavaram: తెలుగు హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. కొన్నాళ్ల పాటు ప్లాపులతో ఇబ్బంది పడ్డ కిరణ్.. గతేడాది " క " సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు దిల్ రుబా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ తన లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

కిరణ్‌ అబ్బవరంకు రాజకీయాలంటే ఇష్టమంటా అతను హీరో కాకపోయి ఉంటే రాజకీయాల్లోకి వెళ్లేవాడిని చెప్పుకొచ్చారు. ప్రజలతో మమేకం కావడం తనకు నచ్చుతుందన్నారు. తనది రాయలసీమ కావడంతో రాజకీయాలను చిన్నప్పటి నుంచి దగ్గరగా చూశానన్నారు. అందుకే రాజకీయాల పట్ల తనకు ఆసక్తి పెరిగిందన్నారు కిరణ్ అబ్బవరం.

నటుడిగా రాజకీయాల్లోకి రావాల్సినప్పుడు చేస్తున్న ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పారు కిరణ్. ఇకపోతే పెళ్లి తర్వాత జీవితం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో వ్యాపారం చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఫుడ్ బిజినెస్‌లో రాణించాలనేది తన కోరిక అని.. మంచి రాయలసీమ స్టైల్ ఆహారం అందించాలని ఉందని చెప్పారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నామని.. త్వరలోనే అనౌన్స్ చేస్తానని చెప్పారు కిరణ్ అబ్బవరం.

కిరణ్.. రహస్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజావారు రాణిగారు సినిమాతో కిరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అందులో రహస్య హీరోయిన్‌గా చేశారు. ఈ మూవీ షూటింగ్‌‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే వీరు తల్లిదండ్రులం కాబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం దిల్ రుబా సినిమాతో మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వకరుణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 

Tags:    

Similar News