Kiara Advani: ప్రెగ్నెన్సీ కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న కియారా..!

డాన్3లో కియారా అద్వానీ నటించనున్నట్టు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి కియారా తప్పుకున్నట్టు బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.

Update: 2025-03-06 10:00 GMT

 ప్రెగ్నెన్సీ కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న కియారా..!

Kiara Advani: నటి కియారా అద్వానీ.. బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు వారికి దగ్గరయ్యారు. మహేష్, రాంచరణ్ సరసన నటించి మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. ఇటీవల తాను తల్లి కాబోతున్నట్టు కూడా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు డాన్ 3 నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కియారా ఒకరు. హిందీతో పాటు దక్షిణాదిలోనూ ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే కియారా చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. యష్ టాక్సిక్‌, హృ‌తిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్2లోనూ కియారా హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు బాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ డాన్3. ఈ మూవీలో కియారా అద్వానీ నటించనున్నట్టు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి కియారా తప్పుకున్నట్టు బాలీవుడ్ సినీ వర్గాల సమాచారం.

డాన్ 3 సినిమాకు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. రణ్‌వీర్ సింగ్ డాన్ పాత్రలో నటించబోతున్నాడు. షారూఖ్ ఖాన్ నటించిన డాన్, డాన్2 చిత్రాలకు కొనసాగింపుగా ఈ చిత్రం రాబోతుంది. అయితే కియారా ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో కియారాకు 2023లో వివాహం జరిగింది. తాజాగా తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టు ఈ జంట ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ప్రెగ్నెన్సీ కారణంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి కియారా తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో డాన్ 3లో కొత్త హీరోయిన్‌ కోసం వెతికే పనిలో పడ్డింది చిత్రబృందం. మరోవైపు డాన్3ని వదులుకున్న కియారా తన ఇతర ప్రాజెక్టులైన వార్2, టాక్సిక్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాల తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News