Kalyan Art Productions: కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ.. కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను ప్రారంభించిన నిర్మాత కళ్యాణ్
Kalyan Art Productions: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త కథలకు, నూతన ప్రతిభకు ఊపిరిపోసే లక్ష్యంతో 'కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్' (Kalyan Art Productions) పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభమైంది.
Kalyan Art Productions: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త కథలకు, నూతన ప్రతిభకు ఊపిరిపోసే లక్ష్యంతో 'కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్' (Kalyan Art Productions) పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభమైంది. నిర్మాత కళ్యాణ్ ఈ బ్యానర్‌ను నెలకొల్పుతూ, టాలీవుడ్‌లో కంటెంట్ ఆధారిత చిత్రాలకు పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించారు.
కథే హీరో.. ప్రతిభే ప్రామాణికం!
నిర్మాత కళ్యాణ్ ఈ సందర్భంగా తన సంస్థ లక్ష్యాలను వెల్లడించారు..ప్రస్తుతం పరిశ్రమలో కొత్తవారికి అవకాశాలు లభించడం సవాలుగా మారిన తరుణంలో, నైపుణ్యం ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
"కథే హీరో" అనే సిద్ధాంతంతో, సమకాలీన అంశాలపై ప్రేక్షకులను ఆలోచింపజేసేలా వినూత్న చిత్రాలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ఆలోచనలకు, ప్రయోగాత్మక చిత్రాలకు తమ బ్యానర్ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని కళ్యాణ్ హామీ ఇచ్చారు.
కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన కథలను సిద్ధం చేసింది. ఈ బ్యానర్ నుంచి రాబోయే మొట్టమొదటి సినిమా వివరాలను సంక్రాంతి పండుగ సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రకటన వెలువడిన వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్రబృందం అన్ని సన్నాహాలు చేస్తోంది.