'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే

Update: 2019-03-04 08:22 GMT

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో 'ఆర్ ఆర్ ఆర్' ఒకటి. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి సినిమా గురించి అందులో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పాత్రల గురించి పుకార్లు బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక గజదొంగ కనిపించనున్నాడట. అడవిలో నివసించే ఒక గజదొంగ పాత్ర పోషించనున్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం బాగా బాడీ కూడా పెంచానున్నాడట. దానికోసమే ఎన్టీఆర్ మళ్లీ బరువు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వం వహించిన 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్ చిన్నపాటి దొంగ గా కనిపించాడు. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ ను గజదొంగ గా ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఇక ఈ సినిమా ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్తో సాగుతుంది అని తెలిసిన విషయమే. ఈ సినిమాలో హీరోయిన్ల వేట ఇంకా కొనసాగుతూ ఉంది. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Similar News