Ken Shimura: క‌రోనాతో క‌మెడీయ‌న్ మృతి.. మ‌ర‌ణించిన తొలి సెల‌బ్రిటీ..

Update: 2020-03-30 04:53 GMT
Represetational Image

కరోనా వైరస్ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. చైనాలో మొదలైన ఈ వైరస్ 195 దేశాలకు పైగా వ్యాపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఐరోపా దేశాల్లో క్రమక్రమంగా ఈ వైరస్ పెరుగుతూ వస్తుంది. ఇక ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక ఇటలీలో అయితే ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటికి పది వేల మంది మరణించారు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా జ‌ప‌నీస్ క‌మెడీయ‌న్ కెన్‌ షిమురా ని కరోనా బలితీసుకుంది. కొద్ది రోజుల క్రితం కరోనా వ‌ల‌న కెన్ షెమురా(70) ఆసుప‌త్రిలో అడ్మిట్ కాగా, ప‌రిస్థితి విషమించ‌డంతో క‌న్నుమూశారు. కరోనా వైర‌స్ వ‌ల‌న మ‌ర‌ణించిన తొలి జ‌పాన్ సెల‌బ్రిటీ ఇత‌నే. మార్చి 19న కెన్‌ షిమురా తీవ్ర జ్వ‌రంతో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయినట్టు మీడియా చెబుతుంది. ఆదివారం అత‌ను మ‌ర‌ణించ‌గా, ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. జ‌పాన్‌కి చెందిన బెస్ట్ క‌మెడీయ‌న్స్‌లో షిమురా ఒక‌రు. 1970,80 కాలంలో ఆయ‌న క‌మెడీయ‌న్‌గా ప్రేక్ష‌కులని ఎంత‌గానో అల‌రించారు. 


 


Tags:    

Similar News