Pawan Kalyan: పవన్ అభిమానులకు పూనకాలే.. జల్సా కొత్త ప్రింట్ నెక్స్ట్ లెవెల్ అంటూ డైరెక్టర్ ట్వీట్..

Pawan Kalyan: తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌లో రీ రిలీజ్ ల ప‌ర్వం కొన‌సాగుతోంది.

Update: 2022-08-13 10:09 GMT

Pawan Kalyan: పవన్ అభిమానులకు పూనకాలే.. జల్సా కొత్త ప్రింట్ నెక్స్ట్ లెవెల్ అంటూ డైరెక్టర్ ట్వీట్..

Pawan Kalyan: తెలుగు చిత్ర ప‌రిశ్రమ‌లో రీ రిలీజ్ ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇటీవ‌లే మ‌హేశ్ బాబు జ‌న్మదినం సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాలు ఒక్కడు, పోకిరిల‌ను ప‌లు థియేట‌ర్లలో రీ రిలీజ్ చేశారు. వాటిని మ‌హేశ్ అభిమానుల‌తో పాటు సినీ అభిమానులు కూడా చూసి ఆనందించారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఏదో ఒక సినిమాని ఆయన పుట్టినరోజు (సెప్టెంబర్‌ 2వ తేదీ ) సంధర్భంగా విడుదల చేయాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదిక కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు జల్సా సినిమాని 4కె రెసొల్యూషన్ తో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది.

ఈ మేరకు కొబ్బరిమట్ట, హృదయ కాలేయం సినిమాల దర్శకుడు సాయి రాజేష్ వెల్లడించారు. 'కొత్త ప్రింట్‌లో బాబు కొత్తగా కొన్న అద్దంలా మెరిసిపోతున్నాడు. సౌండ్‌ క్వాలిటీ అద్భుతంగా ఉంది. మీ సెలబ్రేషన్స్‌ మొదలు పెట్టండి' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ చూసిన పవన్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 14 ఏళ్ల క్రితం థియేటర్లలో సినిమా చూసిన వాళ్లు, అప్పుడు థియేటర్లలో సినిమాను మిస్‌ అయిన వారు మరోసారి జల్సా చేయడానికి సిద్ధమవుతున్నారు.


Tags:    

Similar News