OTT: ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?
OTT: పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’.
OTT: ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?
OTT: పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించడం విశేషం. ఫిబ్రవరి 21న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా యువతలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది.
ఇక తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి టాక్ దక్కించుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై విడుదల చేశారు. పవిష్ నారాయణ్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్‌లకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. అందుకే తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లను రాబట్టింది.
థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మార్చి 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుందని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. మిళం, తెలుగు భాషల్లో ఒకేసారి అందుబాటులోకి రానుంది.
వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై స్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, వెంకటేష్ మీనన్, రబియా ఖాటూన్, రమ్య రంగనర్హన్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో చూసేయండి.