సరిలేరుకి కొత్త చిక్కు.. అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్నఈ సినిమా ప్రమోషన్స్ జోరుని పెంచేసింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని విడుదలకి సిద్దం అయింది. కానీ సెన్సార్ పూర్తి అయిన సందర్భంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఎక్కడ కూడా రిలీజ్ డేట్ ఇవ్వకుండా కేవలం సంక్రాంతి రిలీజ్ అని మేన్షన్ చేయడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా అందరికి అనుమానాలు కలుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాని జనవరి 12న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ అప్పుడే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాను కూడా జనవరి 12నే విడుదల చేస్తునట్టుగా ప్రకటించారు. దీనితో సినిమాకి సంబందించిన ఇద్దరు నిర్మాతలు కలిసి మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చారు.
దీనితో మహేష్ సరిలేరు నీకేవ్వరు జనవరి 11 న, అల్లు అర్జున్ జనవరి 12 న రిలీజ్ అన్నట్టుగా అనౌన్స్ చేశారు. ప్రమోషన్ లో భాగంగా విడుదల చేస్తున్న పోస్టర్ లలో కూడా అదే డేట్స్ ని మేన్షన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాను కాస్త ముందుకు జనవరి 10నే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో సరిలేరు నీకెవ్వరు టీం కూడా రిలీజ్ డేట్ ని మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
రెండు భారీ సినిమాలు ఒకే టైంకి రిలీజ్ అవుతుండడంతో ధియేటర్ల సమస్య, ఓపెనింగ్ సమస్య ఏర్పడుతుంది కాబట్టి సినిమాల విడుదల తేదిలను కూర్చొని సమకూర్చుకోవాలని సినీ పెద్దలు చెబుతున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాపైన భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.
సెన్సార్ టాక్:
ఈ సినిమాకి సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలని తెలుస్తోంది. ఇక బిజినెస్ మెన్ సినిమా తర్వాత మహేష్ కెరియర్ లో అతి తక్కువ రోజుల్లో కంప్లీట్ చేసిన సినిమా ఇదే కావడం విశేషం.. జూన్ 1న ప్రారంభమైన ఈ చిత్రం డిసెంబర్ 18న షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. ఇక అంతే త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది.
ఇక ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు. సినిమా బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని, ఆర్మీ రోల్ లో మహేష్ నటన బాగుందని అంటున్నారు. ఈ సంక్రాంతికి మహేష్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి సినిమాకి అంతా పాజిటివ్ టాకే వస్తుంది. కానీ రొటీన్ యాక్షన్ డ్రామా కావడం, నిడివి కూడా పెద్దగా ఉండడం సినిమాకి మైనస్ లు గా చెబుతున్నారు.