Ileana Dcruz: మరోసారి నోరుపారేసుకున్న ఇలియానా
Ileana Dcruz: సినీ ఇండస్ట్రీ క్రూరమైనది అంటూ ఇక్కడ అవకాశాలు అందడంలో సమానత్వం ఉండదని ఇలియానా తెలిపింది.
Ileana Dcruz:(The Hans india)
Ileana Dcruz: టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. తొలిసారి నటనతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఇండస్ట్రీ పట్ల కూడా బాగా విమర్శలు చేస్తూ ఉంటుంది. తాజాగా ఇలియానా సినీ ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.
సినీ ఇండస్ట్రీ క్రూరమైనది అంటూ ఇక్కడ అవకాశాలు అందడంలో సమానత్వం ఉండదని తెలిపింది. ఇందులో పాపులారిటీనే బిగ్ ఫాక్టర్ అంటూ, ఎప్పుడైతే పాపులారిటీ కోల్పోతారో.. అప్పుడే ఇక్కడ అవకాశాలు కూడా ఉండవని తెలిపింది. ఇక తన విషయంలో కూడా అదే జరిగింది అంటూ అభిమానులతో పంచుకుంది. ఇటువంటి క్రూరమైన పరిస్థితులు ఉన్నచోట నిలబడడం కష్టమని తెలిపింది.
పలు సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకొని టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ పట్టేశాక బాలీవుడ్ బాట పట్టిన ఇల్లీ బేబీ అక్కడ కొన్ని సినిమాలు చేసి.. తిరిగి టాలీవుడ్ వంక చూస్తోంది. ఈ మేరకు ఇటీవలే రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించి అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ అమ్మడికి నాగార్జున సరసన నటించే మరో అవకాశం దక్కిందని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో ఇలియానాకు ఛాన్స్ ఇచ్చారని టాక్.