Ilaiyaraaja: మోదీని కలిసిన ఇళయరాజా.. ఎందుకో తెలుసా.?
Ilaiyaraaja: ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.
Ilaiyaraaja: మోదీని కలిసిన ఇళయరాజా.. ఎందుకో తెలుసా.?
Ilaiyaraaja: ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలతో పాటు.. 'ఇళయరాజా గారిని కలవడం ఆనందంగా ఉంది. ఆయన మ్యూజిక్ ప్రపంచానికి చేసిన సేవలు అపారమైనవి. లండన్‌లో వెస్ట్రన్ క్లాసికల్ సింఫోనీ నిర్వహించిన తొలి ఆసియా సంగీతకారుడిగా ఆయన నెలకొల్పిన రికార్డు అసాధారణమైంది. ఇది ఆయన సంగీత ప్రయాణంలో ఓ గొప్ప మైలురాయి. ఇళయరాజా నిజంగా సంగీత ప్రపంచానికి ఓ అమూల్య రత్నం' అని మోదీ రాసుకొచ్చారు.
ఇళయరాజా కూడా ఈ భేటీపై స్పందించారు. “మోదీతో నా సమావేశం ఎంతో మధురమైంది, మరపురాని అనుభవం. ‘సింఫోనీ వాలియంట్’ ప్రాజెక్ట్ సహా పలు రకాల అంశాలపై చర్చించాం. ఆయన నుంచి వచ్చిన అభినందనలు, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని తన ఎక్స్ అకౌంట్‌లో రాసుకొచ్చారు. వీరిద్దరి కలయిక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.