Solo Bratuke So Better : అసలు విషయం బయటపెట్టిన మెగా హీరో!
Solo Bratuke So Better : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్న(ఆదివారం) రోజున తన ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే..
hey idi nenena song will be release on august 26th from Solo Bratuke So Better movie
Solo Bratuke So Better : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిన్న(ఆదివారం) రోజున తన ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే... ఆ వీడియోలో బ్యాచిలర్ హీరోలందరూ కలిసి ఉన్న 'సింగిల్ ఆర్మీ' అనే వాట్సాప్ గ్రూప్ నుంచి యంగ్ హీరోలు నిఖిల్, నితిన్, రానా.. ఇలా ఒక్కొక్కరుగా లెఫ్ట్ అయ్యారు. ఇక చివరగా సాయి ధరమ్ తేజ్ కూడా లెఫ్ట్ అవుతూ.. "ప్రభాస్ అన్నా.. సారీ, ఇప్పుడు నా వంతు వచ్చిందంటూ" గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు. దీనితో హీరో సాయి ధరమ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్తలు వచ్చాయి..
అయితే ఈ రోజు అసలు విషయాన్ని బయట పెట్టాడు తేజు.. తాజాగా తానూ నటిస్తున్న సోలో బ్రతుకు సో బెటర్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా వీడియో షేర్ చేసినట్టుగా ప్రేక్షకులకు అర్ధం అయిపొయింది.. సినిమా నుంచి అంతకుముందు "నో పెళ్ళి దాని తల్లి" అంటూ ఓ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.. దీనికి సూపర్భ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా మొన్నటి వరకు నో పెళ్ళి అన్న విరాట్‌కి అమృతని చూసాక ఎమైంది అంటూ "హే ఇది నేనేనా" అనే మరో సాంగ్ 26 ఉదయం 10గం.లకి విడుదల చేయనున్నారు. విరాట్ కి ఏమైంది అని తెలియాలంటే...26వ తేది వరకు ఆగక తప్పదు అన్నమాట..
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది. మే 1వ తేదీన విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.
అంత strict గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూసాక ఏమైంది ???#HeyIdiNenena from #SoloBratukeSoBetter on 26th Aug at 10AM. Another lovely song from this album. #SBSB2ndSingle pic.twitter.com/iD4NuWliYv
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 24, 2020