Heroines Action Films: యాక్షన్‌ సినిమాలకు సై.. హీరోలకు ఏ మాత్రం తీసిపోని నటీమణులు

హీరోయిన్స్ అనగానే ముందుగా గ్లామర్ గుర్తొస్తుంది. అయితే ఈ ట్రెండ్‌ను పక్కనబెట్టి యాక్షన్ చిత్రాలకు సై అంటున్నారు నటీమణులు. అందంలోనే కాదు.. యాక్షన్‌లోనూ అదరగొడతామంటున్నారు.

Update: 2025-03-08 12:05 GMT

యాక్షన్‌ సినిమాలకు సై.. హీరోలకు ఏ మాత్రం తీసిపోని నటీమణులు

Heroines Action Films: హీరోయిన్స్ అనగానే ముందుగా గ్లామర్ గుర్తొస్తుంది. అయితే ఈ ట్రెండ్‌ను పక్కనబెట్టి యాక్షన్ చిత్రాలకు సై అంటున్నారు నటీమణులు. అందంలోనే కాదు.. యాక్షన్‌లోనూ అదరగొడతామంటున్నారు. ఈ విషయంలో హీరోలకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్స్ ఎవరు..? వాళ్లు నటించే వైలెంట్ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

అనుష్క.. క్రిష్ దర్శకత్వంలో ఘాటి అంటూ పలకరించబోతున్నారు. నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలి కథ అంటూ ఈ చిత్ర బృందం కథను పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో అనుష్క ఇందులో అనుష్క వైలెంట్‌గా కనిపించింది. ఈ మూవీ ఏప్రిల్ 18న విడుదల కానుంది.

నయనతార రక్కయీ చిత్రంలో ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీని సెంథిల్ నల్లసామి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కుమార్తె కోసం అనుష్క పోరాటం చేయనుంది. కూతురే ప్రపంచంగా బతుకుతున్న ఓ తల్లి.. ఆ బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసి మృగాళ్లను ఎదుర్కొనేందుకు యుద్ధం చేయడానికి రెడీ అయింది. ఇంతకీ ఆమె కథేంటి..? తన కూతురికి తలెత్తిన ప్రమాదం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఏప్రిల్ 14 వరకు ఆగాల్సిందే.

కీర్తి సురేష్.. గ్లామర్ పాత్రలతో పాటు కథానాయికగా ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ నటిస్తున్నారు. రివాల్వర్ రీటా అనే యాక్షన్ సినిమాలో రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. రివాల్వార్ పట్టుకుని దొంగలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా కథేందో తెలియాలంటే మార్చి 30 వరకు వెయిట్ చేయాల్సిందే.

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస యాక్షన్ కథలతో స్క్రీన్ పై కనిపించి జోష్ పెంచుతోంది. ఇటీవల యాక్షన్ సిరీస్ సిటాడెల్: హన్నీబన్నీతో అదరగొట్టింది. ఇప్పుడు మరో వినూత్నమైన కథతో సొంత నిర్మాణ సంస్థలో ఓ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే మా ఇంటి బంగారం. ఓ గృహిణి తుపాకీ పట్టుకుని పోరాటం చేస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపనుంది. మరి ఈ గృహిణి కథేంటి..? ఎందుకు అంత వైలెంట్‌గా మారిందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

వీళ్లేకాదు గతంలోనూ చాలామంది నటీమణులు యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. బాలీవుడ్‌లోనూ హీరోయిన్స్ యాక్షన్ చిత్రాల్లో నటించి ఔరా అనిపించారు. మరి ఇప్పుడు యాక్షన్ చిత్రాలతో మెప్పించేందకు మన ముందుకు రాబోతున్న అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సమంత సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి. 

Tags:    

Similar News