గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న హీరో సూర్య.. చేతిలో ఆరు సినిమాలు

గ్యాప్ లేకుండా ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు హీరో సూర్య. ఇప్పుడు ఏకంగా అరు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం

Update: 2019-11-17 06:35 GMT
Hero surya

గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు హీరో సూర్య. ఇప్పుడు ఏకంగా అరు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా అంటూ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ్ భాషలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇదేకాకుండా తనకి అచ్చొచ్చిన సింగం సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు సూర్య.. దీనికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది.

ఇక తాజాగా కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్టు అయిందో మనందరికీ తెలిసిన విషయమే.. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడు అయన సూర్యకి కూడా ఓ లైన్ ని వినిపించారట.. ఆ లైన్ కూడా సూర్యకి బాగా నచ్చడంతో పూర్తి కథని సిద్దం చేయాలనీ కోరారట. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాది చివరిలో పట్టాలేక్కే ఛాన్స్ ఉంది.

మొదట్లో సూర్య కెరీర్‌ కి కాకా కాకా, సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ సినిమాలు బాగా ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలను గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తెరకెక్కించారు. ఇప్పుడు అయన దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు సూర్య. ప్రస్తుతం కథ చర్చలు అయితే నడుస్తున్నాయి. దీనిపై ఆఫీషల్ అనౌన్స్ మెంట్ త్వరలో వెలువడనుంది. అంతేకాకుండా అజిత్ కి మంచి హిట్లు ఇచ్చిన శివ దర్శకత్వంలో కూడా సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు వెట్రీమారన్‌ దర్శకత్వంలో ఓ సినిమాని లైన్ లో పెట్టాడు.. ఇవేకాకుండా మరో కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ సినిమాని చేస్తున్నాడు సూర్య. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు ఈ హీరో.. 

Tags:    

Similar News