Siddharth: హీరో సిద్ధార్థ్ ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ..

Siddharth: ఆయన టక్కర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Update: 2023-04-19 16:00 GMT

Siddharth: హీరో సిద్ధార్థ్ ఈసారి హిట్ కొట్టడం గ్యారెంటీ

Siddharth: సినీ హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బొమ్మరిల్లు సినిమాతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. సిద్ధార్థ్ తెలుగులోనే కాదు తమిళం, హిందీ భాషల్లో కూడా నటించాడు. కానీ అంతగా సక్సెస్ కాలేదు. సినిమా ఇండస్ట్రీకి కొన్నేళ్ల పాటు దూరమైన సిద్ధార్థ్ ఇటీవలే రీఎంట్రీ ఇచ్చి..వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆయన టక్కర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

టక్కర్ సినిమాకు కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహించగా సిద్ధార్థ్ సరసన మజిలీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. తాజాగా టక్కర్ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. టీజర్ చూస్తుంటే ఈసారి సిద్ధార్థ్ గట్టిగానే కొట్టేలా కనిపిస్తున్నాడు.

ఓ పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి డబ్బున్న అమ్మాయితో ప్రేమలో పడే కథాంశంతో టక్కర్ మూవీని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతోంది. ఇదొక రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఉంది. టీజర్ చూస్తుంటే సినిమాలో రొమాంటిక్ పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సినిమా హిట్టవ్వడం సిద్ధార్థ్ కే కాదు హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ కు కూడా ముఖ్యమే. ఎందుకంటే మజిలీ సినిమా తర్వాత చేసిన రామారావు ఆన్ డ్యూటీ, మైఖేల్ చిత్రాలు ఆమెను నిరాశకు గురి చేశాయి. అందుకే, దివ్యాంశ ఆశలన్నీ ప్రస్తుతం టక్కర్ పైనే ఉన్నాయి.

టక్కర్ సినిమాలో సిద్ధార్థ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నాడు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. ఇక దివ్యాంశ కూడా చాలా గ్లామరస్ గా కనిపిస్తూ ఎట్రాక్ట్ చేస్తోంది. మొత్తంగా, టీజర్ తో మెప్పించిన సిద్ధార్థ్, దివ్యాంశ..బాక్సాఫీస్ దగ్గర కూడా అదే రేంజ్ లో మురిపించి హిట్టందుకుంటారేమో చూడాలి.

Full View


Tags:    

Similar News