Rana, Miheeka Marriage : రానా ఇంట మొదలైన పెళ్లి సందడి!

Rana, Miheeka Marriage : టాలీవుడ్ లో మొన్నటివరకూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన వారంతా మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు

Update: 2020-08-08 05:02 GMT
Rana, Miheeka Marriage

Rana, Miheeka Marriage : టాలీవుడ్ లో మొన్నటివరకూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన వారంతా మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్ పెళ్లి పీటలు ఎక్కారు. ఇక ఇవ్వాళా (ఆగస్టు 8) హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. తన ప్రేయాసి మిహికాను వివాహం ఆడబోతున్నాడు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో వేదికలో వీరి వివాహం జరుగుతుంది. కరోనా నేపధ్యంలో జరుతున్న పెళ్లి కావడంతో కొందరు మాత్రమే హాజరు కానున్నారు.

ఇక ఇప్పటికే ప్రి-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌, మెహందీ ఫంక్షన్ లలో రానా, మిహిక జంట చూడముచ్చటగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇక శుక్రవారం రాత్రి సంగీత్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ వేడుకలో అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. రానా- మిహిక బజాజ్ పెళ్లి కార్యక్రమాలు తెలుగు సంప్రదాయాలు, మర్వాడీ సంప్రదాయల ప్రకారం జరుగుతున్నాయి. ఇరువురు తమ సాంప్రదాయ పద్ధతిలో వివాహాన్ని జరిపిస్తున్నారు.

ఇక వాస్తవానికి రానా పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయాలనీ అనుకున్నారట అయన తండ్రి సురేష్ బాబు.. కానీ కరోనా నేపధ్యంలో జరుగుతున్న పెళ్లి కావడంతో కొందరిని మాత్రమే ఆహ్వానించాల్సి వస్తుంది. తన కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయలేకపోతున్నామనే బాధ మాత్రం ఉంది.. కానీ తప్పడం లేదని అన్నారు సురేష్ బాబు..

ఇక రానా సినిమాల విషయానికి వచ్చేసరికి గతఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో ఆకట్టుకున్న రానా, ప్రస్తుతం అరణ్య ,విరాటపర్వం సినిమాలలో నటిస్తున్నాడు. ఇందులో అరణ్య విడుదలకి సిద్దంగా ఉండగా, విరాటపర్వం షూటింగ్ చివరిదశలో ఉంది. 

Tags:    

Similar News