పవన్, బండ్ల మూవీ దర్శకుడు ఫిక్స్?
Pawan Kalyan Bandla Ganesh Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిర్మాత బండ్ల గణేష్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా బండ్ల గణేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు..
Bandla Ganesh, Pawan kalyan
Pawan Kalyan Bandla Ganesh Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిర్మాత బండ్ల గణేష్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా బండ్ల గణేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పవన్ వేణు శ్రీరామ్, క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలని చేసేందుకు కమీట్ అయ్యాడు. అయితే ఈ సినిమాల తరవాత పవన్ ని డైరెక్ట్ చేసేది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అంటూ ప్రచారం నడుస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో బద్రి, కెమెరా మెన్ గంగతో రాంబాబు అనే సినిమాలను చేశాడు పూరి.. ఇప్పుడు ఈ సినిమా చేస్తే అది మూడో సినిమా అవుతుంది. అటు నిర్మాత గణేష్ తో కూడా ఇప్పటికే ఇద్దరమ్మాయిలతో, టెంపర్ అనే సినిమాలను చేశాడు పూరి.. ఇప్పుడు ఈ సినిమా చేస్తే అది మూడో సినిమానే అవుతుంది. సో ముచ్చటగా వీరి కాంబినేషన్ లో మూడో సినిమా అంటూ ప్రచారం సాగుతుంది. కానీ దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది..
అటు కరోనా వలన పవన్ షూటింగ్ లకి దూరంగా ఉంటూ వచ్చిన పవన్ మళ్ళీ షూటింగ్ లను మొదలు పెట్టనున్నాడు.. ప్రస్తుతం నాలుగు సినిమాలకి కమీట్ అయి ఉన్న పవన్ అన్నింటిని చకచక ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. అందులో ఇప్పటికే వకీల్ సాబ్ చివరి దశకు చేరుకుంది. ఇక 2022లో బండ్ల గణేష్ సినిమాని పవన్ స్టార్ట్ చేయనున్నాడు.. అటు పూరి కూడా ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు పూరి.. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.