Guntur Kaaram: 300 కోట్ల స్టార్ ఎందుకు 40 కోట్లని టార్గెట్ చేశాడు?

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు తన మార్కెట్ ని ఎక్స్ పాండ్ చేస్తున్నాడు.

Update: 2024-01-06 06:05 GMT

Guntur Kaaram: 300 కోట్ల స్టార్ ఎందుకు 40 కోట్లని టార్గెట్ చేశాడు?

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు తన మార్కెట్ ని ఎక్స్ పాండ్ చేస్తున్నాడు. గుంటూరు కారం మూవీ విషయంలో తన టార్గెట్ మారింది. యూఎస్ లో ఈ సారి తన టార్గెట్ ఐదు మిలియన్లు అని తేలింది. 300 కోట్లు స్టార్ అయిన తను కేవలం 40 కోట్లని టార్గెట్ చేయటం వెనకున్న రీజనేంటి?

గుంటూరు కారం మూవీ యూఎస్ లో రోజుకి కనీసం 2 లక్షల డాలర్లు విలువ చేసే టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. ఫిల్మ్ టీం మాత్రం యూఎస్ లో కనీసం 5 మిలియన్ డాలర్లు వచ్చేలా అక్కడ భారీ ఎత్తున గుంటూరు కారాన్ని రిలీజ్ చేస్తోంది. లెక్కమార్చింది.

మహేశ్ బాబు కెరీర్ లో ఇంతవరకు యూఎస్ లో మూడున్నర మిలియన్ల వసూల్లు దాటలేదు. అంటే 28 కోట్ల వసూల్ళే అక్కడ వచ్చాయి. ఈ సారి యూఎస్ లో కనీసం 5 మిలియన్లు అంటే 40 కోట్లను టార్గెట్ గా పెట్టుకుని భారీ ఎత్తున అక్కడ సినిమాలను ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.

మాటల మాంత్రికుడి సినిమాలేవి కూడా ఇంతవరకు యూఎస్ లో 3.6 మిలియన్లు దాటలేదు. అల వైకుంఠపురంలో మూవీ కూడా యూఎస్ లో కేవలం 3.6 మిలయన్లే రాబట్టింది. కాబట్టే త్రివిక్రమ్ కూడా తన మూవీ మార్కెట్ ని యూఎస్ లో ఘననీయంగా పెంచుకోవాలని, ఈసారి ఎక్కువ స్క్రిన్స్ లో రిలీజ్ కి ప్రయత్నం చేస్తున్నాడు.

టాలీవుడ్ తో పాటు రెస్టాఫ్ ఇండియా మార్కెట్ ఎంత ముఖ్యమో, యూఎస్ మార్కెట్ కూడా తెలుగు సినిమాకు అంతే ముక్యం. అంతెందుకు కన్నడ మూవీ కేజీయఫ్ 2 కి యూఎస్ లో 7 మిలియన్లు వస్తే, హిందీ మూవీ రాకీ ఔర్ రాణీ ప్రేమ్ కథకి పదిన్నర మిలియన్లు వచ్చాయి. ఓరకంగా యూఎస్ మార్కెట్టే ఆ రెండు సినిమాల స్థాయిని, బాలీవుడ్ మార్కెట్ తర్వాత పెంచింది.

సలార్ మూవీ ఆల్రెడీ బాహుబలి 1 వసూళ్లని యూఎస్ లో దాటేసింది. 8. 5 మిలియన్లు దాటిన సలార్ మరో పదిరోజుల్లో పదిన్నర మిలియన్లు దాటొచ్చంటున్నారు. ఈ జోరుచూసే అక్కడే ఎక్కువ థియేటర్స్ లో గుంటూరు కారం ని రిలీజ్ చేసి, వసూల్ల లెక్కలు మార్చాలనుకుంటోందట మహేశ్, త్రివిక్రమ్ టీం.

Tags:    

Similar News