Ghantasala Ratnakumar: ఘంటసాల రత్నకుమార్ మృతి..

Ghantasala Ratnakumar: తెలుగు లెజెండరీ సింగర్ ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌ గుండె పోటుతో కన్నుమూశారు

Update: 2021-06-10 05:00 GMT

Ghantasala Ratnakumar:(File Image) 

Ghantasala Ratnakumar Dubbing Artist: తెలుగు లెజెండరీ సింగర్ ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు రత్న కుమార్ గుండెపోటుతో చెన్నైలో కన్ను ముశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయనకు రెండు రోజుల క్రితమే నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చి కిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. అయితే రత్న కుమార్ చాలా రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు తాజాగా హార్ట్ ఎటాక్‌ రావడంతో చెన్నైలోని కావేవి హాస్పటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రత్నకుమార్ ఆకస్మిక మరణంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. మరోవైపు ఆయన మరణ వార్త చిత్రపరిశ్రమలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.

రత్న కుమార్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, సంస్కృత భాషల్లో 1090 సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. హీరోలు అర్జున్, కార్తీక్, అరవిందస్వామి, సల్మాన్‌ఖాన్, షారుక్‌ఖాన్‌లకు ఎక్కువ డబ్బింగ్ చెప్పారు రత్న కుమార్. అంతేకాదు కొన్ని సినిమాలకు మాటలను అందించారు. వాటిలో ముఖ్యమైనవి ఆట ఆరంభం, వీరుడొక్కడే, అంబేద్కర్ సినిమాలున్నాయి. ఆయన కుమార్తె వీణ తెలుగులో అందాల రాక్షసి, తమిళంలో ఉరుం చిత్రాల్లో నేపథ్య గాయనిగా మంచి పేరు తెచ్చుకుంది.

Tags:    

Similar News