OTT: ఓటీటీలోకి కొత్త థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే

OTT: తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన కంటెంట్‌ను అందించడంలో హనుమాన్ మీడియా పతాకం ఎప్పుడూ ముందుండే సంస్థ.

Update: 2025-04-29 07:30 GMT

OTT: ఓటీటీలోకి కొత్త థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే

OTT: తెలుగు ప్రేక్షకులకు నాణ్యమైన కంటెంట్‌ను అందించడంలో హనుమాన్ మీడియా పతాకం ఎప్పుడూ ముందుండే సంస్థ. సూపర్ మాచి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనేజర్స్, కథ కంచికి మనం ఇంటికి వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాత బాలు చరణ్ ఇప్పుడు మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను అందిస్తున్నారు.

తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఆరత్తు సీనం (Aarathu Sinam) చిత్రాన్ని "గరుడ 2.0" పేరుతో తెలుగులో డబ్ చేసి ఆహా ఓటీటీ వేదికగా విడుదల చేశారు. అరివాళగన్ వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డిమోంటి కాలనీ ఫేమ్ అరుళ్ నితి, ఐశ్వర్యా రాజేష్, ఐశ్వర్యా దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు.సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

కిల్లర్ ఎవరు? కేసులు ఎలా పరిష్కరించబడ్డాయి? వెనక ఉన్న మిస్టరీ ఏంటి? అన్న అంశాలతో ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఉంది. తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుందని నిర్మాత బాలు చరణ్ నమ్మకంతో చెబుతున్నారు. థ్రిల్లర్ మూవీలను ఇష్టపడే వారికి గరుడ 2.0 ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News