Actress: వరుస ప్లాఫ్‌లు ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?
Actress: చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇటీవల ఒక ట్రెండ్‌లా నడుస్తోంది.
Actress: చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇటీవల ఒక ట్రెండ్‌లా నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ హీరోయిన్ ఫొటో తెగ ట్రెండ్ అవుతోంది.
పైన ఫొటోలో చూడముచ్చటగా చిన్నారి పెళ్లి కూతురిలా కనిస్తున్న పాప ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. కెరీర్ తొలినాళ్లలో అంతగా సక్సెస్ అందుకోలేదు. వరుస ఫ్లాప్ సినిమాలతో కెరీర్ నెమ్మదించింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీకి భారీగా క్రేజ్ ఉంది. నిత్యం గ్లామరస్ ఫోటోషూట్స్‌తో ట్రెండింగ్‌లో ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ గేర్ మార్చేసింది! ఇప్పుడు ఏకంగా పవన్ సరసన నటిస్తోంది.
ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల తార నిధి అగర్వాల్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో నిధి అగర్వాల్. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్‌తో హరిహర వీరమల్లు మూవీలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సరసన రాజాసాబ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇక నిధి విషయానికొస్తే.. బెంగుళూరులో పుట్టినా, హైదరాబాద్‌లో పెరిగిన నిధి చదువు మధ్యలో మోడలింగ్ వైపు మళ్లింది. అక్కినేని నాగచైతన్యతో చేసిన 'సవ్యసాచి'తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో గుర్తింపు దక్కలేదు. 'మిస్టర్ మజ్ను'తో రెండోసారి ట్రై చేసినా ఫలితం మారలేదు. కానీ.. పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అనంతరం తమిళ చిత్రాల్లో అవకాశాలు వెల్లువెత్తాయి. కోలీవుడ్ స్టార్ శింబుతో నిధి ప్రేమలో ఉందన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఆవన్నీ కేవలం రూమర్స్‌గానే మిగిలిపోయాయని నిధి క్లారిటీ ఇచ్చింది.