Baby Movie: తక్కువ బడ్జెట్.. కోట్ల లాభాలు.. బేబీ సినిమాలో ఈ ముగ్గురి పారితోషకం తెలిస్తే హర్ట్ అయిపోతారంతే..!

Baby Movie: చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా.. అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2023-07-22 08:30 GMT

Baby Movie: తక్కువ బడ్జెట్.. కోట్ల లాభాలు.. బేబీ సినిమాలో ఈ ముగ్గురి పారితోషకం తెలిస్తే హర్ట్ అయిపోతారంతే..!

Baby Movie: చిన్న సినిమాగా విడుదలైన బేబీ సినిమా.. అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూత్‌ నుంచి పెద్దల వరకు ఈ సినిమాను ఎంతగానో ఇష్టపడుతున్నారు. దీంతో ఈసినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో విజయ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. సాయి రాజే‌శ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాకు ఎస్‌కేఎన్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో విరాజ్‌ అశ్విన్‌ ప్రముఖ పాత్ర పోషించాడు. యూట్యూబ్‌ స్టార్‌గా సుపరిచితమైన వైష్ణవి చైతన్య.. ఈ సినిమాలో నటనతో అందర్నీ మెప్పించింది.

అయితే, ఈ చిన్న సినిమాకు కేవలం రూ. 10 కోట్లలోపే ఖర్చయిందంట. అంచనాలు లేకుండానే ఈ సినిమా రిలీజ్ అయింది. ఇప్పటి వరకు రూ. 50కోట్లు రాబట్టిందట. అయితే, ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ఆనంద్‌ దేవరకొండకు ఎంత పారితోషకం ఇచ్చారో తెలుసా? కేవలం రూ.80 లక్షలే ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే హీరోయిన్ వైష్ణవికి కేవలం రూ.30 లక్షలు ఇచ్చారంట. ఇక కీలక పాత్ర పోషించిన విరాజ్‌ అశ్విన్‌కు మాత్రం రూ.20 లక్షలు అందించారంట. డెరెక్టర్ సాయి రాజేష్ కోటి అందుకున్నాడంట.

తక్కువ బడ్జెట్‌లో వచ్చిన ఈ సినిమా కోట్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఊహించని విధంగా సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో, హీరోహీరోయిన్లకు మరింత ముట్టజెప్పనున్నరని తెలుస్తోంది.

Tags:    

Similar News