Kalyan Ram: కళ్యాణ్ రామ్ మూవీ షూటింగ్‌లో అగ్ని ప్రమాదం..?

Kalyan Ram: హీరో కళ్యాణ్‌ రామ్‌ సినిమా షూటింగ్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

Update: 2024-05-10 05:42 GMT

Kalyan Ram: కళ్యాణ్ రామ్ మూవీ షూటింగ్‌లో అగ్ని ప్రమాదం..?

Kalyan Ram: హీరో కళ్యాణ్‌ రామ్‌ సినిమా షూటింగ్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.4 కోట్ల నష్టం జరిగిందని తెలుస్తోంది. సినిమాలో ప్రతేకమైన సన్నివేశం కోసం వేసిన భారీ సెట్ లో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్‌ చిలుకూరి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. విభిన్నమైన కథతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది.

ఈ సినిమా కథలో భాగంగా ఒక సీబీఐ ఆఫీస్ లో కొంత షూట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సీబీఐ ఆఫీస్ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. సుమారు పది రోజుల పాటు ఈ సీబీఐ ఆఫీస్ సెట్ లో షూటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే 9 రోజుల షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఒక రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సెట్టు మొత్తం అగ్నికి ఆహుతి అయినట్లుగా తెలుస్తోంది. 9వ రోజు షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత ఎనిమిది గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని అయితే ఈ విషయం సుమారు ఒకటిన్నర ప్రాంతంలో సినిమా యూనిట్ దృష్టికి వచ్చిందని వెళ్లేలోపు దాదాపు మొత్తం కాలిపోయిందని తెలుస్తోంది.

Tags:    

Similar News