Kasibhatla Venugopal: ప్రముఖ రచయిత కాశీభట్ల వేణుగోపాల్ కన్నుమూత

Kasibhatla Venugopal: ప్రముఖ కవి, రచయిత శీభట్ల వేణుగోపాల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 70 ఏళ్లు.

Update: 2024-08-19 10:13 GMT

Kasibhatla Venugopal

Kasibhatla Venugopal: కాశీభట్ల వేణుగోపాల్ కన్నుమూశారు. ఆయన వయస్సు 70 ఏళ్లు. ప్రముఖ కవి, రచయితగా ఆయన సుప్రసిద్దులు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కర్నూల్ లోని కాశీభట్ల యల్లప్పశాస్త్రి, హనుమాంబ దంపతుల చిన్న కొడుకే వేణుగోపాల్.

చిన్నతనంలోనే స్పష్టంగా మాట్లాడడాన్ని చూసిన తల్లి ఆయనకు కాళిదాసు, రఘువంశ కావ్యంలోని శ్లోకాలను నేర్పించారు. తల్లితోపాటు అక్కలకు కూడా సాహిత్యంపై ఇష్టం... ఆ ప్రభావం ఆయనపై పడింది. మల్లాది, బుచ్చిబాబుల ప్రభావం ఆయనపై ఉంది. గుంటూరు శేషేంద్ర శర్మకు ఆయన వీరాభిమాని. తొలుత అభ్యుదయ, విప్ల సాహిత్యం పట్ల ఆకర్షితుడయ్యారు. 1974లో రంగనాయకి లేచిపోయింది అనే కథతో ఆయన సాహితీ ప్రయాణం ప్రారంభమైంది.

Tags:    

Similar News