క్రికెటర్ల సందడిలో 'బుట్టబొమ్మ'..నిన్న వార్నర్..ఇప్పుడు పీటర్సన్!

లాక్ డౌన్ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్..

Update: 2020-05-13 16:09 GMT
Kevin Pietersen Dance for Butta Bomma Song

లాక్ డౌన్ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. గ్రౌండ్ లోనే కాదు టిక్ టాక్ లో కూడా దుమ్ము లేపుతున్నాడు. ఇప్పటికే కత్రినా, అల్లు అర్జున్ సినిమా పాటలకి టిక్ టాక్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన డేవిడ్ వార్నర్ మరో వీడియోతో ముందుకు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. త‌న భార్య క్యాండీస్ కూతురు ఇండీతో క‌లిసి వార్నర్ త‌మిళ సాంగ్‌కి సంబంధించిన మ్యూజిక్‌కి స్టెప్పులు వేశారు.

తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ కూడా అల్లు అర్జున్ 'బుట్ట బొమ్మ' పాటకు టిక్ టాక్ చేసాడు. ఈ పాటకు తనదైన శైలిలో స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. ప్రస్తుతం బుట్ట బొమ్మ పాటకు పీటర్సన్ చేసిన తిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఇక టిక్ టాక్ వీడియో చేయడం పీటర్సన్ కు కొత్త కాదు. గతంలో కూడా ఈ ఆటగాడు చేసిన టిక్‌టాక్‌ వీడియోలకు ఫుల్‌ క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే.

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్ జింబాంబే తో 2004లో జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ ద్వారా క్రికెట్ లో ఆరంగేట్రం చేసాడు. కెరీర్ తోలి నుండే తనదైన బాటింగ్ స్టైల్ తో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఇలా వన్ డే కాకుండా టెస్ట్ మ్యాచ్ లో కూడా తనదైన బాటింగ్ తో అలరించి ఎన్నో విజయాలను జట్టుకు అందించాడు. అతి కొద్దీ కాలంలోనే జట్టు సారధిగా బాధ్యతలు స్వీకరించి జట్టును ముందుండి నడిపించి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను కట్టబెట్టాడు.



Tags:    

Similar News