Eesha Rebba: బ్లాక్ శారీలో ఈషా రెబ్బా గ్లామర్ షో – ఫొటోలు వైరల్

తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బా ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది

Update: 2025-06-16 13:37 GMT

 Eesha Rebba: బ్లాక్ శారీలో ఈషా రెబ్బా గ్లామర్ షో – ఫొటోలు వైరల్

 Eesha Rebba: తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బా ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. స్టార్ హీరోల పక్కన అవకాశాలు రాకపోయినా, వచ్చిన చాన్సులను సద్వినియోగం చేసుకుంటూ తనదైన ట్రాక్‌లో దూసుకెళ్తోంది ఈషా.

తెలుగు సినిమాల‌తో పాటు తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో కూడా నటించిన ఈషా, ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. '3 రోజెస్' సీజన్ 2లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

ఇటీవల బ్లాక్ శారీలో తన లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈషా రెబ్బా, తన గ్లామర్‌తో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. నల్ల చీరలో ఆమె ఎలిగెంట్ లుక్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. "క్యూట్ అండ్ క్లాస్ బ్యూటీ", "కిల్లర్ లుక్స్" అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈషా నటనతో పాటు స్టైల్‌లో కూడా ఎంత ముందుందో మరోసారి చూపించిందనే చెప్పాలి.

Tags:    

Similar News