OTT: ఓటీటీలోకి డ్రాగన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?
OTT: యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కొత్త చిత్రం డ్రాగన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
OTT: యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కొత్త చిత్రం డ్రాగన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రదీప్, నటనతోనే కాకుండా దర్శకత్వంలో కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తాజాగా విడుదలైన డ్రాగన్ సినిమాకు భారీ స్పందన లభించింది.
అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని AGS ఎంటర్టైన్‌మెంట్ నిర్మించింది. అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించగా, కె.ఎస్. రవికుమార్, మైష్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. లవ్, రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, 10 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు వెర్షన్‌లో కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుందీ మూవీ. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా రూ. 120 కోట్లు రాబట్టినట్లు సమాచారం. థియేటర్లలో హౌజ్ ఫుల్ షోలతో రన్ అవుతు్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మార్చి 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ రానుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికా ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాలో స్నేహ, ఇవానా, దర్శకుడు అశ్వత్ మరిముత్తు అతిథి పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.