Vani Jairam: ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపై అనుమానాలు..!
Vani Jairam: వాణీ జయరాం ఇంటిని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు
Vani Jairam: ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపై అనుమానాలు..!
Vani Jairam: ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నుదురు, ముఖంపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నైలోని ఆమె ఇంటిని స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వాణీ జయమామ్ నివాసానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం క్లూస్ సేకరిస్తున్నారు. పని మనిషి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. వాణీ జయరామ్ ఇంటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరీశీలిస్తున్నారు.
ఉదయం ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టినా వాణీ జయరాం తలుపు తీయలేదని పోలీసులకు పనిమనిషి తెలిపారు. దీంతో తలుపుబద్దలు కొట్టి లోపలికి వెళ్లినట్లు చెప్పారు. నుదురు, ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉన్నాయని, అప్పటికి ఆమె స్పృహలో లేరని వివరించారు. దీంతో పనిమనిషి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. తర్వాత వాణీ జయరాం పార్థివ దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.