DJ Tillu: 'డీజే టిల్లు' సీక్వెల్ నుంచి దర్శకుడు అవుట్!?

DJ Tillu: ప్రస్తుతం ఓ సినిమా హిట్ అయితే చాలు అదే పేరుతో ఆ సినిమా సీక్వల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Update: 2022-07-18 08:30 GMT

DJ Tillu: ‘డీజే టిల్లు’ సీక్వెల్ నుంచి దర్శకుడు అవుట్!? 

DJ Tillu: ప్రస్తుతం ఓ సినిమా హిట్ అయితే చాలు అదే పేరుతో ఆ సినిమా సీక్వల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ 'డీజే టిల్లు'కు కూడా సీక్వల్ చేస్తున్నారు. నూతన దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా రెండో భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్స్ చేస్తున్నారు. ఆగస్ట్‌లో షూటింగ్ మొదలు కాబోతున్న తరుణంలో ఊహించని విధంగా ఈ సినిమా నుంచి దర్శకుడు తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం హీరో సిద్ధు జొన్నలగడ్డతో డిఫరెన్సెస్ వల్లనే దర్శకుడు విమల్ సీక్వెల్ నుండి తప్పుకున్నట్లు వినికిడి.

అయితే డైరక్టర్ లేని ఇంప్యాక్ట్ సినిమా మీద ఎంత మేరకు పడుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సూపర్ హిట్ సినిమా సీక్వల్ కి మొదటి సినిమా డైరక్టర్ ఉంటేనే ఆ జోష్ ఉంటుంది. ఒకవేళ క్రియేటివ్ గొడవలు ఉన్నా అది సినిమా అవుట్ పుట్ మీద దెబ్బ పడేలా కాకుండా ఉంటే బాగుండేది. మొత్తానికి డీజే టిల్లు 2 నుంచి వచ్చిన ఈ కొత్త అప్డేట్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేసింది. త్వరలోనే కొత్త దర్శకుడు పేరు ప్రాజెక్ట్ ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక ఈ సీక్వెల్ లో నేహాశెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు.

Tags:    

Similar News