నెక్స్ట్ సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు
* రామ్ చరణ్ సినిమా గురించి లీక్ ఇచ్చిన దిల్ రాజు
నెక్స్ట్ సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు
Dilraju: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు చేతిలో బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మధ్యనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన "వారసుడు" సినిమాతో కొన్ని వివాదాల్లో ఇరుక్కున్న దిల్ రాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం కొన్ని భారీ బడ్జెట్ సినిమాల తో తాము బిజీగా ఉన్నట్లు తెలిపారు దిల్ రాజు.
మిగతా స్టార్ నిర్మాతల లాగా దిల్ రాజు కూడా ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాల మీద పడ్డారు. అలాంటి కొన్ని లార్జర్ థాన్ లైఫ్ సినిమాలు కొన్ని ప్లాన్ చేస్తున్నట్లు దిల్ రాజు చెప్పుకొచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్ మరియు కథ ఆధారంగా కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయని అన్నారు దిల్ రాజు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కూడా ఒకటి అని తెలుస్తుంది. అందులో ఒకటి ప్రముఖ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో "జటాయు" సినిమాని నిర్మిస్తున్నామని చెప్పిన దిల్ రాజు హిట్ మరియు హిట్ 2 సినిమాల ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో కూడా ఒక ప్యాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా "సలార్" సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించబోతున్న సినిమాని కూడా నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సినిమాకి "రవణం" అనే టైటిల్ ను ఖరారు చేసినట్ల కూడా చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్ "సలార్" సినిమాతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. అంటే దిల్ రాజు చెప్పిన సినిమా రామ్ చరణ్ తోనే తీయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.