Coolie Review : థియేటర్లలో రజనీకాంత్ మాస్ స్వాగ్.. నాగార్జున, ఆమిర్ ఖాన్ ఎలా రాణించారు?

Coolie Review : థియేటర్లలో రజనీకాంత్ మాస్ స్వాగ్.. నాగార్జున, ఆమిర్ ఖాన్ ఎలా రాణించారు?

Update: 2025-08-14 06:57 GMT

Coolie Review : థియేటర్లలో రజనీకాంత్ మాస్ స్వాగ్.. నాగార్జున, ఆమిర్ ఖాన్ ఎలా రాణించారు?

Coolie Review : లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ తన పాత స్వాగ్‌తో తిరిగి వచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'కూలీ' సినిమాతో, అభిమానులు చాలా కాలంగా మిస్ అయిన పవర్-ప్యాక్డ్ రజనీని వెండితెరపై చూసే అవకాశం దొరికింది. మాస్ డైలాగులు, సిగరెట్ ఫ్లిప్ స్టైల్, స్టైలిష్ వాకింగ్ తో రజనీకాంత్ తనదైన ముద్ర వేశారు. అయితే, ఈ సినిమాను కేవలం రజనీ స్వాగ్ కోసం చూడటం మాత్రమే కాదు, ఇందులో ఇతర నటీనటుల అద్భుతమైన నటన కోసమైన ఈ సినిమాను చూడాల్సిందే. రజనీకాంత్ అభిమానులకు ఈ సినిమా ఒక పండగ అని చెప్పాలి. కానీ, లోకేష్ కనగరాజ్ కేవలం రజనీకాంత్‌పైనే దృష్టి పెట్టకుండా, ఇతర కీలక పాత్రలకు కూడా ప్రాముఖ్యత ఇచ్చారు.

కూలీ సినిమా అభిమానుల పండగలా థియేటర్లలో విడుదలయ్యింది. అయితే, అమెరికాలో వచ్చిన తొలి రివ్యూలు మాత్రం సినిమా అంచనాలను అందుకోలేదని విమర్శించాయి. ఈ విమర్శల మధ్య రజనీకాంత్ తనదైన స్వాగ్, పవర్-ప్యాక్డ్ ప్రదర్శనతో సినిమాను తన భుజాలపై మోసారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రజనీ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి ఒక వేడుకలా నిలిచింది. కూలీ సినిమా రజినీ కాంత్ 171వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక అంశాల ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

సినిమా కథాంశం

ఈ సినిమా కథ సిమన్ (నాగార్జున) అనే స్మగ్లింగ్ నెట్‌వర్క్ చుట్టూ తిరుగుతుంది. కథలోకి దేవ (రజనీకాంత్) ఎందుకు వచ్చాడు, అతని గతం ఏమిటి, ప్రీతి (శృతి హాసన్)తో అతని బంధం ఏమిటి, స్నేహం ఎలా ఈ కథను ముందుకు నడిపింది అనే అంశాలతో కూలీ కథ నడుస్తుంది.

నటీనటుల పర్ఫామెన్స్

రజనీకాంత్ తన పాత మాస్ స్టైల్‌తో తిరిగి వచ్చి అభిమానులను ఉర్రూతలూగించారు. సినిమాలోని మాస్ డైలాగ్స్, స్టైలిష్ నడకలు, సిగరెట్ ఫ్లిప్ వంటివి ఆయన అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డీ-ఏజింగ్ టెక్నాలజీతో చూపించిన ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో రజనీ నటన అద్భుతమని, ఇది సినిమాకే హైలైట్‌గా నిలిచిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, కొంతమంది విశ్లేషకుల ప్రకారం, రజనీకాంత్ అద్భుతంగా నటించినప్పటికీ కథనం కారణంగా సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఒక పెద్ద ప్లస్ పాయింట్. నాగార్జున పర్ఫెక్ట్ విలన్‌గా మెప్పించారు. సినిమాకు ఆయనే వెన్నెముక అని చెప్పొచ్చు. రజనీకాంత్‌కు ధీటుగా నిలిచే పాత్రలో నాగార్జున నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో సౌబిన్ షాహిర్ ఒక సైకో కిల్లర్‌గా తన డార్క్ షేడ్‌తో ఆకట్టుకున్నాడు. కథలో కీలకమైన పాత్రలో నటించిన శృతి హాసన్ భావోద్వేగాలను పండించి, సినిమాకు ప్లస్ అయ్యారు. క్లైమాక్స్‌లో ఆమిర్ ఖాన్ క్యామియో అందరినీ ఆశ్చర్యపరిచింది.

లోకేష్ కనగరాజ్ స్క్రీన్‌ప్లే ఆకట్టుకున్నప్పటికీ, మొదటి భాగం నెమ్మదిగా, ఊహించిన విధంగా సాగిందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, సెకండాఫ్ లో ముఖ్యంగా చివరి 20 నిమిషాల్లో వచ్చే యాక్షన్, డ్రామా సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు ఇప్పటికే ట్రెండింగులో ఉన్నాయి.

సినిమా విశ్లేషణ

లోకేష్ కనగరాజ్ ఈసారి చాలా సింపుల్ కథను ఎంచుకున్నారు. ఫస్టాప్ ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే లోకేష్ సినిమాల్లో ఉండే హై-ఎండ్ యాక్షన్, వేగం ఇందులో తక్కువగా ఉన్నాయి. కానీ, రెండో భాగం మాత్రం చాలా నిరాశపరిచింది. ఇది 'లియో' సినిమా తర్వాత లోకేష్‌కు ఎదురైన మరో సమస్య అని విమర్శకులు అంటున్నారు. సెకండాఫ్ చాలా నిదానంగా సాగుతుంది. నాగార్జున పాత్రను సరిగా ఉపయోగించుకోలేకపోయారు.

టెక్నికల్ అంశాలు

మ్యూజిక్ : అనిరుధ్ రవిచందర్ తన బెస్ట్ అవుట్‌పుట్‌ను ఇచ్చారు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఒక బ్యాక్‌బోన్‌గా నిలిచాయి.

సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా మంచి విజువల్ స్టైల్‌ను ఇచ్చింది. ఇది సినిమాకు ఒక ప్లస్ పాయింట్.

ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్‌లో లోపాలు కనిపించాయి. ముఖ్యంగా రెండో భాగం చాలా నిదానంగా సాగడానికి ఎడిటింగే ప్రధాన కారణం.

హైలైట్స్

రజనీకాంత్ స్వాగ్, డైలాగ్స్

మొదటి భాగం

అద్భుతమైన టెక్నికల్ వర్క్

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

డ్రాబ్యాక్స్

బోరింగ్‌గా సాగిన సెకండాఫ్

నాగార్జున పాత్ర బలహీనంగా ఉండటం

ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ పాత్రలను సరిగా ఉపయోగించుకోకపోవడం

మొత్తంగా, రజనీకాంత్ స్వాగ్ కోసం, నాగార్జున విలనిజం కోసం, లోకేష్ డైరెక్షన్‌లోని యాక్షన్ కోసం ఈ సినిమాను థియేటర్లలో చూడవచ్చని అభిమానులు చెబుతున్నారు. ఈ సినిమాను రజనీ ఫ్యాన్స్ తో కలిసి థియేటర్లలో చూస్తేనే నిజమైన మజా.

రేటింగ్ : 3/5

Tags:    

Similar News