Chiranjeevi: ‘కొదమసింహం’.. సినిమా పెడితే తప్ప చరణ్ భోజనం చేసేవాడు కాదు
Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపారు.
Chiranjeevi: ‘కొదమసింహం’.. సినిమా పెడితే తప్ప చరణ్ భోజనం చేసేవాడు కాదు
Chiranjeevi: మెగా స్టార్ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిపారు. చిరంజీవి కెరీర్లో హిట్ సినిమాలో ఒకటైన, ఎంతో స్పెషల్ అయిన సినిమా కొదమ సింహం నవంబర్ 21న రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చిరంజీవి సినిమాతో తనకున్న జ్ఞాపకాలను పంచుకున్నారు.
కొదమ సింహం సినిమాలో స్టిల్ అంటే తనకు చాలా ఇష్టమని.. మొదటిసారి క్లీన్ షేవ్ కాకుండా గడ్డంతో చేసిన సినిమా ఇదేనని తెలిపారు. ఈ సినిమా తనకంటే చరణ్కి ఎక్కువ ఇష్టమని…అప్పట్లో రామ్ చరణ్ చిన్నప్పుడు వాళ్లమ్మ కొదమసింహం సినిమా క్యాసెట్ పెడితే కానీ భోజనం చేసేవాడు కాదని చెప్పారు. చిరు చరణ్ గురించి మాట్లాడిన ఈ మాటలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.