Chiranjeevi: పవన్ స్పీచ్‌పై స్పందించిన చిరు.. ఏమన్నారంటే..?
Chiranjeevi: మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పవన్ కళ్యాణ్ జయకేతం పేరుతో సభ నిర్వహించిన విషయం తెలిసిందే.
Chiranjeevi: మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పవన్ కళ్యాణ్ జయకేతం పేరుతో సభ నిర్వహించిన విషయం తెలిసిందే. పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, గతంలో తనపై కేసులు పెట్టారని, కుట్రలు చేసినా ఇప్పుడేమీ ఆపలేవని, ఈసారి విజయంతో జయకేతనం ఎగురవేస్తున్నామని గర్వంగా తెలిపారు. అలాగే జనసేన జన్మస్థలం తెలంగాణ, కర్మస్థలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. 'నాకు పునర్జన్మ ఇచ్చింది తెలంగాణ భూమి. నేను సినిమాల్లోకి వచ్చానని, రాజకీయాల్లోకి వస్తానని అసలు ఊహించలేదు. కానీ కోట్లు మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన ఈ రంగంలోకి రావడం దేవుడి సంకల్పమే" అని చెప్పారు.
ఓవైపు రాజీయాల గురించి మాట్లాడుతూనే మరోవైపు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా పవన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే పవర్ ఫుల్ పంచ్ డైలాగ్‌లను సైతం విసిరారు. దీంతో పవన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. పవన్ వ్యాఖ్యలపై పలువురు ప్రశసంలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందించారు.
మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్ అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో.. 'జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యాను. సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.