Chiranjeevi: కైకాల సత్యనారాయణను కలిసిన మెగాస్టార్ దంపతులు

* కైకాలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Update: 2021-07-25 15:45 GMT

కైకాల సత్యనారాయణను కలిసిన మెగాస్టార్ (ఫోటో: ట్విట్టర్) 

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగితో కలిసి టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ నివాసానికి వెళ్లారు. సత్యనారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన మెగాస్టార్ తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు అంటూ కొనియాడారు. కైకాల సత్యనారాయణ తనకు ఎంతో ఆప్తుడని వెల్లడించారు. సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయనతో కాసేపు ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి అని చిరంజీవి తెలిపారు.




 


Tags:    

Similar News