Chiranjeevi: ఫ్లాప్ అవుతున్న చిరంజీవి సలహాలు

Chiranjeevi: చిరంజీవి సలహాలు ఔట్ డేటెడ్ అయిపోయాయా?

Update: 2022-10-20 01:41 GMT

Chiranjeevi: ఫ్లాప్ అవుతున్న చిరంజీవి సలహాలు

Chiranjeevi: తెలుగు ఇండస్ట్రీపై మెగాస్టార్ చిరంజీవి ప్రభావం చాలాసార్లు ఉంది అని చెప్పవచ్చు. 40 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో చిరంజీవి ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మరియు రికార్డ్ బ్రేకింగ్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. తన అదిరిపోయే పర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ, డాన్స్ స్టెప్పులతో ఎందరో అభిమానులను పొందారు. అయితే పర్ఫామెన్స్ విషయంలో 100% ఇచ్చే చిరంజీవి కొన్ని సార్లు సినిమా దర్శకత్వం మరియు స్క్రిప్ట్ విషయాలలో కూడా తలదూరుస్తూ ఉంటారని తెలిసిన విషయమే. తన సినిమా ఎక్స్పీరియన్స్ ని ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ మరియు దర్శకత్వం విషయాలలో వాడుతూ ఉంటారు చిరు. అయితే గత కొంతకాలంగా చిరంజీవి ఇస్తున్న సలహాలు ఏమాత్రం వర్కౌట్ అవ్వట్లేదు అంతేకాకుండా అవి తిరిగి సినిమాపై నెగటివ్ ఎఫెక్ట్ లు చూపిస్తున్నాయి.

గతంలో చిరంజీవి ఒక సినిమా విషయంలో ఏం చెప్తే అదే జరిగేది కానీ ఈ మధ్యకాలంలో చిరు ఇస్తున్న ఇన్పుట్ లు ఔట్ డేటెడ్ గా ఉంటున్నాయని కొందరు చెబుతున్నారు. ఉదాహరణకు "సైరా నరసింహారెడ్డి" సమయంలో చిరంజీవి స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేశారని పరుచూరి చెప్పిన సంగతి తెలిసిందే. ఆచార్య విషయంలో కూడా రామ్ చరణ్ పాత్ర విషయంలో చిరంజీవి కొరటాల శివ కు బోలెడు సలహాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చిరంజీవి దర్శకులపై నమ్మకం లేకుండా వాళ్ళని బలవంతం చేసి మరి తన సలహాలను ఇంప్లిమెంట్స్ చేస్తున్నారని, ఎంత సినిమా ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో సజెషన్స్ తన సినిమాలకి ఏమాత్రం వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పవచ్చు.

Tags:    

Similar News