Raja Saab Trailer Postponed: అప్పుడేమో ఊదరగొట్టారు, ఇప్పుడేమో వాయిదా వేశారు!
ప్రభాస్ నటిస్తున్న 'రాజాసాబ్' సినిమా ట్రైలర్ రిలీజ్ వాయిదా పడటంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎలివేషన్లు ఇచ్చి తీరా సమయానికి డేట్ ప్రకటించకుండా ఊరిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 'రాజాసాబ్' సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ తీరు ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. మొన్నటి వరకు ఊదరగొట్టిన మేకర్స్, తీరా ట్రైలర్ రిలీజ్ సమయానికి మళ్ళీ వాయిదా బాట పట్టడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రభాస్ తోనే చెప్పించి.. ఇప్పుడు సైలెంట్!
నిజానికి మొన్న జరిగిన వేడుకలో స్వయంగా ప్రభాస్ తోనే ట్రైలర్ గురించి అనౌన్స్ చేయించారు. ట్రైలర్ ఒక రేంజ్ లో ఉండబోతోందని భారీ ఎలివేషన్లు ఇచ్చారు. కట్ చేస్తే, నిన్న రావాల్సిన ట్రైలర్ రాకపోగా.. వాయిదా పడుతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. పోనీ వాయిదా వేశారు కదా, నెక్స్ట్ డేట్ ఏంటో చెబుతారా అంటే అదీ లేదు. దీంతో నెట్టింట ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమోషన్ స్ట్రాటజీ ఏది?
సాధారణంగా ఒక పెద్ద సినిమా ట్రైలర్ వస్తోందంటే వారం ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. కానీ రాజాసాబ్ విషయంలో అలాంటి బజ్ ఏదీ కనిపించలేదు. అసలు ప్రమోషన్ ప్లాన్ ఉందా లేదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
మైనస్ అవుతున్న సాంగ్స్: ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఆశించిన స్థాయిలో హైప్ తీసుకురాలేకపోయాయి.
ట్రైలర్ పైనే ఆశలు: సినిమాపై పాజిటివ్ వైబ్ రావాలంటే ఇప్పుడు ట్రైలర్ ఒక్కటే ఆఖరి ఆశ. ఇలాంటి కీలక సమయంలో ప్రాపర్ గా ప్రమోట్ చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేయడం ప్రాజెక్టుపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డౌట్ కొడుతున్న వాయిదాలు
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి అస్పష్టత మంచిది కాదని ఫ్యాన్స్ వాపోతున్నారు. వాయిదా వేసినప్పుడు కనీసం కొత్త తేదీని అనౌన్స్ చేస్తే బాగుండేదని, అలా చేయకుండా సైలెంట్ గా ఉండటం వల్ల అసలు షూటింగ్ పనులు పూర్తి కాలేదా లేక పోస్ట్ ప్రొడక్షన్ లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరి ఈ విమర్శలపై 'రాజాసాబ్' టీమ్ ఎలా స్పందిస్తుందో, ఎప్పుడు ట్రైలర్ తో ముందుకొస్తుందో చూడాలి!