వర్మ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ

Update: 2019-12-02 09:40 GMT

రాంగోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ను నిరాకరించింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు అభిప్రాయాన్ని సూచనగా తీసుకొని సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. కాగా మొదటినుంచి వివాదాస్పదంగా మారిన ఈ సినిమా రిలీజ్ విషయంలో సందిగ్థత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వ్యతిరేకంగా మత ప్రబోధకుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆయన తోపాటూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తి కూడా ఈ సినిమాపై కోర్టును ఆశ్రయించాడు. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తాజాగా జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు పలు ఇంటర్వ్యూల్లో వర్మ పేర్కొన్నాడు. మరోవైపు ఈ సినిమా టైటిల్ మార్చాలని రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో సినిమాకు 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు'గా పేరు మార్చారు.

Tags:    

Similar News