Bollywood actors React on Saroj Khan Death: స‌రోజ్ ఖాన్ మృతికి బాలీవుడ్ ఘ‌న నివాళి!

Saroj Khan Death: రిషీ క‌పూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్తల నుంచి బయటకు రాకముందే బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.

Update: 2020-07-03 06:00 GMT
Saroj Khan Death (File images)

Bollywood actors React on Saroj Khan Death: రిషీ క‌పూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్తల నుంచి బయటకు రాకముందే బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.. లెజండ‌రీ బాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్(71) ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు.. ఈ విషయాన్ని ఆమె కూతురు నిర్ధారించారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సంతాపం తెలుపుతుంది. నిమ్ర‌త్ కౌర్, కునాల్ కోహ్లీ, రితేష్ దేశ్ ముఖ్, మ‌నోజ్ బాజ్‌పాయ్, సునీల్ గ్రోవ‌ర్, అక్ష‌య్ కుమార్ త‌దిత‌రులు స‌రోజ్ ఖాన్‌తో ఉన్న జ్ఞాప‌కాలను పంచుకున్నారు..

ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి ఈ వార్త మరింత షాక్ కి గురి చేసింది.. తాను లేవగానే ట్వీట్ లో విచార‌క‌ర‌మైన వార్త విన్నాను. స‌రోజ్ ఖాన్ లేర‌నే వార్త విషాదాన్ని క‌లిగించింది. ఎంతో సులువుగా డ్యాన్స్ చేయ‌గ‌ల ఆమెతో ఎవ‌రైన డ్యాన్స్ చేయ‌గ‌ల‌రు. ఆమె లేకపోవడం ఇండస్ట్రీకి పెద్ద లోటు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అక్షయ్ ట్వీట్ చేశారు. సరోజ్ ఖాన్ డోలా రే డోలా, ఏక్ దో తీన్‌, ధ‌క్ ధ‌క్ ఇలా ఎన్నో సూప‌ర్ హిట్ సాంగ్స్‌కి ఆమె కొరియోగ్ర‌ఫీ చేశారు. స‌రోజ్‌కి భ‌ర్త సోహ‌న్‌లాల్‌, కొడుకు హ‌మీద్ ఖాన్, కూతురు హీనా ఖాన్‌, సుఖైన ఖాన్ ఉన్నారు.

స‌రోజ్ ఖాన్ తన 40 ఏళ్ళ కెరియ‌ర్‌లో 2000 కి పైగా సినిమాలు చేశారు. ఆమెకి అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆమెను ముద్దుగా ఆమె అభిమానులు ది మ‌ద‌ర్ ఆఫ్ డ్యాన్స్ లేదా కొరియోగ్ర‌ఫీ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటారు. స‌రోజ్ ఖాన్ అంత్య‌క్రియ‌లు ఈ రోజు మలాద్ చౌకి సమీపంలోని స్మశానవాటికలో జరగనున్నాయి. 



Tags:    

Similar News