Tejasvi Surya: ఓ ఇంటివాడైన ఎంపీ తేజస్వీ సూర్య.. బెంగళూరులో అంగరంగ వైభవంగా వివాహం
దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య ఓ ఇంటివాడయ్యాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు.
ఓ ఇంటివాడైన ఎంపీ తేజస్వీ సూర్య.. బెంగళూరులో అంగరంగ వైభవంగా వివాహం
Tejasvi Surya: దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందిన తేజస్వి సూర్య ఓ ఇంటివాడయ్యాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
భక్తి, శాస్త్రీయ సంగీత అభిమానులకు శివశ్రీ సుపరిచితమే. మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కాంబోలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ మూవీలోని పాటతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆకర్షించారు. శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజనీరింగ్, మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. అంతేకాదు ఆయుర్వేద కాస్మోటాలజీలో డిప్లోమా కూడా పొందారు. తనకు యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఆమె తండ్రి సిర్కాలి శ్రీ జె స్కందప్రసాద్ మృదంగ కళాకారుడు.
ఇక తేజస్వీ సూర్య వృత్తి రిత్యా లాయర్. ప్రస్తుతం ఆయన బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరుపు వరుసగా రెండో సారి ఎంపీగా గెలుపొందారు. 2019, 2024 ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా తేజస్వి సూర్య కొనసాగుతున్నారు.