Bigg Boss 4 Telugu: అవినాష్ కు సీక్రెట్ టాస్క్.. మోనాల్ ఏడుపుతో రచ్చ..రచ్చ!

Bigg Boss 4 : బిగ్ బాస్ 4 ఎపిసోడ్ 31 లో నామినేషన్ ప్రక్రియ ప్రకంపనలు కొనసాగాయి. అభిజిత్.. అఖిల్ ల మధ్య జరిగిన గొడవను తలుచుకుని మోనాల్ ఏడుస్తూనే ఉంది.

Update: 2020-10-07 04:00 GMT

బిగ్ బాస్ నాలుగో సీజన్ వేడి వేడిగా సాగుతోంది. సోమవారం నామినేషన్ ప్రక్రియ జరిగింది. అందులో 9 మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. ఈ ప్రక్రియలో భాగంగా అఖిల్..అభిజిత్ ల మధ్య గట్టి వాగ్వివాదమూ జరిగింది. ఇక సహజంగానే సోమవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాకా హౌస్ మేట్స్ అందరూ గ్రూపులుగా విడిపోయి చర్చలు మొదలు పెడతారు కదా. ఇక అదే పనిలో దిగారు. ఒకరిని ఒకరు ఆడిపోసుకుంటూ..ఒకరి చరిత్ర ఒకరు తవ్వుకుంటూ.. వాదించుకున్నారు.

అఖిల్, అభిజిత్ లు మోనాల్ ని కూల్ చేసే ప్రయత్నంలో పడ్డారు. ముందు అభిజిత్ మోనాల్ దగ్గర చేరాడు. ఇదంతా నావల్లె జరిగింది.. సారీ అంటూ మొదలు పెట్టాడు. భోరున ఏడుస్తున్న మోనాల్ ని ఓదార్చడానికి అభిజిత్ ప్రయత్నించాడు. నేను నీ గురించి డిస్కస్ చేయలేదు.. హారికతో మాత్రమే నీ గురించి చెప్పా.. అందరి ముందు అఖిలే ఈ టాపిక్ ఎత్తాడు.. నేను కావాలని చేయలేదు అంటూ అభిజిత్ చెప్పుకొచ్చాడు. అయినా, మోనాల్ భోరు భోరున ఏడుస్తూ.. నేను నీకు ఐ లైక్ యు చెప్పానని వేరే వాళ్ల దగ్గర చెప్పడమే కాకుండా.. తను నాకు ఐ లైక్ యు చెప్పితే నీకేంటి అంటూ వాదించావ్.. నామినేషన్ నా గురించి కాదు.. నేను అమ్మాయి కదా.. నా గురించి ఏమనుకుంటారు' అంటూ వెళ్ళిపోయింది.

ఇక్కడ అలా మాట్లాడిన మోనాల్ రాత్రయ్యేసరికి అఖిల్ పక్క చేరి మళ్ళీ కుళాయి విప్పింది. అభిజిత్ తనతో సారీ చెప్ప్పిన విషయం అంతా అఖిల్ కు చెప్పింది. అభిజిత్ ని నేను ఐ లైక్ యు.. ఐ లైక్ యు అన్నాననే మాటలు నువ్ మళ్లీ మళ్లీ ఎందుకు పాయింట్ చేస్తున్నావ్.. ఇది నా టాపిక్ కాదు.. నామినేషన్ కదా అందులో నా టాపిక్ ఎందుకు తీసుకువచ్చారు? అని ప్రశ్నిస్తూ అంటూ అఖిల్ దగ్గర మళ్ళీ భోరుమంది. 'నీకు రైట్స్ ఉన్నాయ్ నా గురించి మాట్లాడటానికి అని అన్నావ్.. ఆ రైట్‌తోనే నేను నీ గురించి మాట్లాడా' అన్నాడు అఖిల్. నువ్ గట్టిగా ఎందుకు అరుస్తున్నావ్.. నేను నీకోసం కొట్లాడుతున్నానంటే వేరే ఏం లేక కాదు.. ఒక అమ్మాయి కోసం వేరే వాళ్ల దగ్గర అలా మాట్లాడటం తప్పు కాబట్టే ఆ పాయింట్ లేవనెత్తాను' అంటూ మోనాల్ కన్నీళ్లు తుడుస్తూ మాట్లాడాడు. దీంతో కూల్ అయిపోయిన మోనాల్ అఖిల్ని వాటేసుకుంది. మరి దీనిని ఏమంటారో.. ఎవరూ చూడరా ఏమిటి మొనాలూ..

ఇక్కడితో అయిపోలేదు.. మోనాల్ కథ.. మొత్తం అంతా ఏడుస్తూనే ఉంది.. తనని ఓదార్చడానికి ఒక్కొరుగా ఆమె దగ్గరకి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళ దగ్గరల్లా ఇదే రచ్చ. అభిజిత్.. అఖిల్ నామినేషన్ లో మాట్లాడిన రెండు మాటల కంటే.. మోనాల్ చేసిన రచ్చ ఎక్కువగా కనిపించింది.

ఇక లాస్య కూడా దివి తనని పప్పు గురించి మాట్లాడింది అంటూ గంగవ్వ దగ్గర వెక్కి వెక్కి ఏడ్చింది. గంగవ్వ ఆమెను ఊరడించడానికి ప్రయత్నించింది.

రాజశేఖర్ మాస్టర్, సొహైల్, కుమార్ సాయిలు నోయల్ ప్రవర్తన పై మాట్లాడుకున్నారు. గ్రూప్‌లు ఫామ్ చేసి తనకు నచ్చినట్టు చేస్తున్నాడని.. నామినేషన్‌లో అమ్మాయి ఉంటే ఒకలా.. వేరే వాళ్లు ఉంటే ఒకలా చేస్తున్నాడని.. నవ్వుతూనే చాలా చేస్తున్నాడు. ఇతన్ని కెప్టెన్ చేస్తా.. అతన్ని కెప్టెన్ చేస్తా.. అతనెవరు కెప్టెన్ చేయడానికి.. హౌస్‌లో అతను పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడని సొహైల్ సీరియస్ అయ్యాడు. తనని నామినేట్ చేసి మోసం చేశాడు.. కన్నింగ్ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్నారు రాజశేఖర్ మాస్టర్.

ఇలా ఎపిసోడ్ లో చాలా భాగం నామినేషన్ ఏడుపుల తోనే సాగిపోయింది. ఇక దీనిని చల్లర్చదానికి గాను..బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఇచ్చాడు.

బీబీ హోటల్ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ ను రెండు టీంలుగా ఏర్పాటు చేశారు. హోటల్ స్టాఫ్‌లో.. అభిజిత్ (మేనేజర్), అఖిల్ (సెక్యురిటీ) సుజాత, లాస్యలు చెఫ్, అమ్మా రాజశేఖర్ అసిస్టెంట్ చెఫ్ అండ్ వెయిటర్, నోయల్ అండ్ కుమార్ హౌస్ కీపింగ్, మోనాల్ అండ్ దివి సర్వీస్ స్పా. అవినాష్ అసిస్టెంట్ మేనేజర్‌గా విభజించారు.

ఇక ఈ టాస్క్ లో అవినాష్ కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అవినాష్ హోటల్ టీం లో ఉంటూనే.. హోటల్ టీం.. గెస్ట్ టీంకి సర్వీస్ చేయడానికి ప్రయత్నిస్తే.. అవినాష్ సీక్రెట్ టాస్క్‌లో భాగంగా వాటిని చేడగోట్టాలి. అయితే, ఇలా సీక్రెట్ టాస్క్ చేస్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు. ఈ టాస్క్ కనుక విజయవంతంగా పూర్తిచేస్తే.. అవినాష్ ను డైరెక్ట్ గా కెప్టెన్ పోటీదారుడుగా ఉంటాడని చెప్పాడు బిగ్ బాస్.

హోటల్ టాస్క్ మొదలైంది. మామూలుగానే అందరూ రచ్చ మొదలెట్టారు. ఎవరికీ వారు జీవిన్చేస్తున్నారు. ఈ టాస్క్ బుధవారం కూడా కొనసాగుతుంది.

Tags:    

Similar News