Bigg Boss 3 Telugu Sunday Episode : మహేష్ విట్టా ఎలిమినేషన్.. బాబా భాస్కర్ ఎమోషన్!

Update: 2019-10-14 03:00 GMT

బాబాభాస్కర్ ఎమోషన్.. అంతా నిజమే చెబుతా సరదా ఆట.. మహేష్ విట్టా ఎలిమినేషన్.. ఇవీ ఈ ఆదివారం బిగ్ బాస్ విశేషాలు.

బాబా భాస్కర్ బిగ్ బాస్ హౌస్ లో నవ్వుతూ.. అందరినీ ఓదారుస్తూ ఉండే మనిషి. గత ఎపిసోడ్ లలో హౌస్ మేట్స్ ఆయనపై చేసిన కామెంట్లకు అయన బాగా హార్ట్ అయ్యారు. ఎమోషన్ తట్టుకోలేక స్మోకింగ్ రూమ్ లో ఎడ్చేశారు. ఇక వీకెండ్ లో భాగంగా నాగార్జున వచ్చారు. బాబా ను ఈ విషయం పై ప్రశ్నించారు. అప్పుడు కూడా తన ఎమోషన్ అపుకోలేకపోయారు బాబా భాస్కర్.

సన్ డే..ఫన్ డే..

మామూలుగానే ఆదివారం ఫన్నీ గేమ్స్ ఆడించే నాగార్జున ఈరోజూ హౌస్ మేట్స్ తొ సరదా ఆటలు ఆడించారు. శ్రీముఖి.. మహేష్ విట్టాలు లీడర్లుగా హౌస్ మేట్స్ ని రెండు టీం లుగా విడదీశారు. ఒక బౌల్‌లో కొన్ని చిట్టీలు పెట్టారు. ఒక్కో టీం నుంచి ఒక్కో కంటెస్టెంట్ వచ్చి చిట్టీ తీసి దానిపై ఏ సినిమా పేరు రాసుందో కెమెరాకు చూపించాలి. ఈ సినిమా పేరును బోర్డుపై బొమ్మల రూపంలో వేసి తన టీం సభ్యులతో చెప్పించాలి. ఈ టాస్క్‌లో శ్రీముఖి టీం విజయం సాధించింది.

తరువాత అమ్మతోడు.. అంతా నిజమే చెబుతాను అనే ఆటను ఆడించారు. ఇందులో భాగంగా అందర్నీ ఫన్నీ ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు యస్ అనేవారు థంబ్స్ అప్, నో అనేవారు థంబ్స్ డౌన్ చూపించాలని చెప్పారు. పెళ్లికి వెళ్లినప్పుడు ఎవరికైనా సైట్ కొట్టారా?, స్కూల్ డేస్‌లో ఎవరికైనా లవ్ లెటర్ ఇచ్చారా?, ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడీతో అమ్మాయితో కానీ, అబ్బాయితో కానీ చాట్ చేశారా? వంటి ఫన్నీ ప్రశ్నలతో సరదాగా ఆట సాగింది.

మహేష్ ఎలిమినేషన్..నవ్వుతూ పంపించిన హౌస్ మేట్స్!

ఈవారం బిగ్ బాస్ నుంచి మహేష్ విట్టా ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. మహేష్ ఎలిమినేషన్ పై ఎవరూ పెద్దగా రియాక్ట్ కాలేదు. ఇంటి నుంచి బయటకు వస్తూ మహేష్ బాబా భాస్కర్ కాళ్ళకు నమస్కారం చేసి బయటకు వెళ్ళాడు. ఇక నాగార్జున మహేష్ ని హోస్ లో నంబర్ వన్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ల ఫొటోను బోర్డుపై అతికించాలని చెప్పారు. ఇక మిగిలిన ఫొటోలను మహేష్ ఇష్టాన్ని బట్టి రెండు, మూడు అంతకన్నా ఎక్కువ ముక్కలుగా చించొచ్చని చెప్పారు. బాబా భాస్కర్ ఫొటోను మహేష్ బోర్డుపై అతికించాడు. మిగిలినవి చింపేశాడు. ఇక మహేష్ బిగ్ బాంబ్ ని శ్రీముఖి మీద వేశాడు. దాని ప్రకారం కిచన్ లో గిన్నెలు అన్నీ శ్రీముఖి కడగాల్సి ఉంటుంది.

మొత్తమ్మీద అనుకున్నట్టుగానే మహేష్ ఎలిమినేషన్ అయిపోయాడు. ఇక బాబా ఎమోషన్ కొంత కనెక్టింగ్ గా అనిపించింది. ఇక ఆదివారం ఆటలూ సరదాగానే సాగాయి ఎపిసోడ్ మొత్తం సరదాగా సాగింది.


Tags:    

Similar News