ఆ షిప్ నుంచి పృథ్వీని రక్షించండి.. భయపెడుతున్న 'భూత్' ట్రైలర్
ఉరి : ది సర్జికల్ స్ట్రెక్స్, మన్‌మర్జియాన్ చిత్రాలతో సినీ ప్రేక్షకులకు దగ్గరైయ్యారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్.
ఉరి : ది సర్జికల్ స్ట్రెక్స్, మన్‌మర్జియాన్ చిత్రాలతో సినీ ప్రేక్షకులకు దగ్గరైయ్యారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. కాగా.. విక్కీ కౌశల్ ప్రధాన ప్రాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'భూత్ : ది హాంటెడ్ షిప్'. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాను ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్కీ సర్వేయింగ్ ఆఫీసర్ పృథ్వీగా కనిపించనున్నారు. ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృద్ధం పేర్కొంది.
ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. సీ బర్డ్ అనే షిప్ ముంబై సముద్రతీరంలో మిస్టరీకి సంబంధించి పలు విషయాలు ఛేదించేందుకు పృధ్వీ ఒంటరిగా ఆ షిప్ లోకి వెళ్తారు. సీ బర్డ్ షిప్‌లో చోటుచేసుకునే భయంకర దృశ్యాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఓడలోని ఆత్మలు పృద్వీని పలిస్తుంటాయి. పృధ్వీ చూసేలోగా గోడలో నుంచి చేతులు వచ్చి అతన్ని ఈడ్చికెలతాయి. ఈ సన్నివేశాలు ట్రైలర్ లో చూపించారు. ఇక ట్రైలర్ చూస్తేనే సినిమా ఇంక ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మీరు కూడా ఒకసారి ఈ ట్రైలర్ చూడండి.