అమ్మతోడు.. ఇకనుంచి నాకు సినిమాలే పని : బండ్ల గణేష్
సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతుంది.
సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతుంది.మెగస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఫాంక్షన్ ప్రాంగణంలో సందడి చేస్తూ.. అభిమానులను ఉర్రుతలూగిస్తున్నారు . కార్యక్రమనికి హాజరైన అతిథులు ఒక్కోక్కరు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో నిర్మాత బండ్ల గణేష్ వేధికపై మాట్లాడారు. మెగస్టార్ చిరంజీవిని ఆయన స్టైల్ లో ఘనంగా ఆకాశనికి ఎత్తిన గణేష్ చిరంజీవి అంత మహోన్నత వ్యక్తి లేరని వ్యాఖ్యానించారు. మహేశ్ బాబుకు ఈ సినిమా కెరీర్ లోనే నిలిపోతుందని బండ్ల గణేష్ చెప్పారు. ఈ సరిలేరు నీకెవ్వరుతో మరోసారి తాను తెరమీద కనిపించబోతున్నామని తెలిపారు. ఇక నుంచి తాను బ్లేడ్ గణేష్ కాదని తెలిపారు. అన్నిటిని వదలి పెట్టానని తెరపైనే కలిపిస్తానని, ఏ రంగంలోనూ అడుగు పెట్టనని ఒట్టు వేశారు. బండ్ల గణేష్ మాట్లాడుతున్నంత సేపు చిరంజీవి, మహేశ్, రష్మీకతోపాటు అతిథులు, అభిమానులు పొట్ట చెక్కలైయ్యేలా నవ్వుతున్నారు.
మరిన్ని లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి