"రవితేజ వల్ల అయిదు కోట్లు మిగిలాయి," అంటున్న బండ్ల గణేష్
* "అందుకే రవితేజ ని పొగిడాను," అంటున్న బండ్ల గణేష్
"రవితేజ వల్ల అయిదు కోట్లు మిగిలాయి," అంటున్న బండ్ల గణేష్
Bandla Ganesh: నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బండ్ల గణేష్ ఈ మధ్యనే నిర్మాతగా కూడా మారారు. కొన్ని సూపర్ హిట్ సినిమాల ను తన ఖాతాలో వేసుకున్న బండ్ల గణేష్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే చాలా వరకు బండ్ల గణేష్ తన కామెంట్ల వల్లే అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యలతో కాంట్రవర్సీలలో నిలుస్తూ ఉంటారు.
తనని తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడిగా ప్రకటించుకున్న బండ్ల గణేష్. ఈ మధ్యనే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన "ధమాకా" సినిమా వేడుకలో కనిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రవితేజ పై బండ్ల గణేష్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాజాగా ఇప్పుడు మరొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ గురించి చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.
"నా ఫస్ట్ సినిమా రవితేజ తోనే తీశాను. 13 ఏళ్ల క్రితం రవితేజ నటించిన ఆంజనేయులు సినిమా వల్ల నాకు ఐదు కోట్లు మిగిలాయి. మా ఇద్దరి మధ్య స్నేహం ఎప్పుడో మొదలైంది. గత 30 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతూనే ఉంది. అందుకే ధమాకా ఆడియో ఫంక్షన్ లో కూడా అంతగా పొగిడాను," అని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే ప్రశంసల వర్షం కురిపించే బండ్ల గణేష్. ఈమధ్య రవితేజ ను కూడా ఆకాశానికి ఎత్తేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరోవైపు రవితేజ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో కరియర్లో ముందుకు దూసుకు వెళ్తున్నారు.